హిట్ ఇవ్వకపోతే ఆయనా కష్టమే!
రకరకాల జానర్ లో కథలు అనుకున్నాడు. వాటిలో కొన్నింటిని తెలిసిన వాళ్లకు షేర్ చేసినా? వాళ్ల నుంచి సరైన ఫీడ్ బ్యాక్ రాకపోడంతో? అభిమానుల మెచ్చిన కథనే తీసుకున్నాడు.;
టాలీవుడ్ లో హరీష్ శంకర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. తొలి సినిమా `షాక్` తో షాక్ తో తిన్న హరీష్ `మిరపకాయ్` తో సెట్ అయ్యాడు. అటుపై `గబ్బర్ సింగ్` రూపంలో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అనంతరం తెరకెక్కించిన `రామయ్యా వస్తావయ్యా` ప్లాప్ అయింది. `సుబ్రమణ్యం ఫర్ సేల్`, `దువ్వాడ జగన్నాధం` యావరేజ్ గా ఆడగా, `గద్దలకొండ గణేష్` ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అనంతరం `మిస్టర్ బచ్చన్ `తో మరో ప్లాప్ ఎదురైంది. ఇలా ఉంది హరీష్ శంకర్ ట్రాక్ రికార్డు. మొత్తంగా హరీష్ కెరీర్ లో పెద్ద విజయాలు మాత్రం కేవలం రెండు చిత్రాలే.
అభిమానుల కోరిక మేరకు:
`మిరపకాయ్`, `గబ్బర్ సింగ్` మాత్రమే. డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభమై రెండు దాశాబ్దాలవుతుంది. కానీ డైరెక్ట్ చేసిన సినిమాలు కేవలం ఎనిమిది మాత్రమే. ఇలా హరీష్ గ్రాఫ్ క్లియర్ గా కనిపిస్తుంది. దీంతో `ఉస్తాద్ భగత్ సింగ్` అన్నది హరీష్ కెరీర్ కి ఎంత కీలకమైన చిత్రమో అంచనా వేయోచ్చు. అందులోనూ పవన్ కళ్యాణ్ ఎంతో నమ్మి రెండవ సారి ఛాన్స్ ఇచ్చారు. `గబ్బర్ సింగ్` విజయం చూసి అదే తరహా చిత్రం కావాలని అభిమానులు అడగడంతో? అంతకు మించి అంటూ హీరీష్ ముందుకొస్తున్నాడు. వాస్తవానికి పవన్ తో హరీష్ ఈ జానర్లో మళ్లీ సినిమా తీయాలనుకోలేదు.
విజయం కీలకమైన సమయం:
రకరకాల జానర్ లో కథలు అనుకున్నాడు. వాటిలో కొన్నింటిని తెలిసిన వాళ్లకు షేర్ చేసినా? వాళ్ల నుంచి సరైన ఫీడ్ బ్యాక్ రాకపోడంతో? అభిమానుల మెచ్చిన కథనే తీసుకున్నాడు. ప్రస్తుతం `ఉస్తాద్ భగత్ సింగ్` అన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ పోర్షన్ షూటింగ్ పూర్తయింది. మిగతా పనులన్నింటిని పూర్తిచేసి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా విజయం హరీష్ కి అత్యంత కీలకం. ఫలితం అటు ఇటు అయితే గనుక హరీష్ కి మరో అవకాశం కష్టమే అన్న టాక్ వినిపిస్తుంది.
గ్యాప్ కి కారణం అదేనా?
ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ గ్యాప్ కి కి గల కారణాలు చర్చకొస్తున్నాయి. హరీష్ వేగంగా కథలు రాయలేడా? రాసినా తీయలేడా? అంటే ఈ రెండు కాదు. ఆయన కథలకు హీరోలు కనెక్ట్ కాకపోవడం సమస్యగా మారిందనే ప్రచారం జరుగుతోంది. `షాక్` కి- `మిరపకాయ్` కి మధ్య ఆరేళ్లు గ్యాప్ ఉంది. `గద్దలకొండ గణేష్`-` మిస్టర్ బచ్చన్` మధ్య ఐదేళ్లు గ్యాప్ ఉంది. కెరీర్ ఆరంభంలో డైరెక్టర్ గా పెద్దగా అనుభవం లేకపోవడంతోనే ఈ గ్యాప్ వచ్చిందన్నది వాస్తవం. కానీ 2019-24 మధ్య గ్యాప్ అన్నది ఏ కారణంగా అంటే? కథల విషయంలో వైవిథ్యత లేకపోవడం అన్నది ఫిలిం సర్కిల్స్ లో చర్చకొస్తుంది. `ఉస్తాద్ భగత్ సింగ్` కథ విషయంలో కూడా ఎంత వర్క్ చేసారో? -హరీష్ మాటల్లో బయట పడిందే.