సందీప్ రాజ్.. మంచి ఛాన్స్ మిస్!

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ గురించి అందరికీ తెలిసిందే. షార్ట్‌ ఫిల్మ్‌ లతో కెరీర్‌ ను ప్రారంభించిన ఆయన.. కలర్‌ ఫోటో చిత్రంతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.;

Update: 2025-12-15 17:39 GMT

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ గురించి అందరికీ తెలిసిందే. షార్ట్‌ ఫిల్మ్‌ లతో కెరీర్‌ ను ప్రారంభించిన ఆయన.. కలర్‌ ఫోటో చిత్రంతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఓటీటీలో నేరుగా విడుదలై ప్రేక్షకులను మెప్పించిన ఆ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించారు. మూవీకి నేషనల్ అవార్డు కూడా రావడంతో మరింత ఫేమ్ సొంతం చేసుకున్నారు.

2020లో కలర్ ఫోటో మూవీ రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు ఐదేళ్ల గ్యాప్ తర్వాత డైరెక్టర్ గా రెండో సినిమా చేసిన విషయం తెలిసిందే. యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల లీడ్ రోల్ లో ఆయన రూపొందించిన మోగ్లీ మూవీ.. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 13వ తేదీన రిలీజైన ఆ సినిమా.. అనుకున్నంత రేంజ్ లో ఆడియన్స్ ను థియేటర్స్ ను రప్పించలేకపోతోంది.

నిజానికి ఐదేళ్ల గ్యాప్ తర్వాత దర్శకుడిగా సినిమా చేయడంతో మంచి అంచనాలు పెట్టుకున్నారు సినీ ప్రియులు. దానికి తోడు విడుదలకు కొద్ది రోజుల ముందు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో మరిన్ని హోప్స్ పెంచుకున్నారు. ఏదో వినూత్నమైన ఆలోచనతో రాసుకున్న కథతో సినిమా చేస్తున్నారని చాలా మంది ఫిక్స్ అయ్యారు.

కానీ సినిమా రిలీజ్ అయ్యాక.. సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. చాలా మంది కొత్త సీసాలో పాత మందు అన్నట్లు.. పాత కథను కొత్తగా మలిచిన ప్రయత్నమని అభిప్రాయపడ్డారు. సినిమాలో చాలా సీన్స్ సాగదీతగా ఉన్నాయని రివ్యూ ఇచ్చారు. దీంతో ఐదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన సందీప్ రాజ్.. డైరెక్టర్ గా రెండో మూవీతో మాత్రం హిట్ అందుకోలేకపోయారు.

ఇప్పుడు ఆ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడైనా టాలెంట్ ఉంటే సరిపోదని.. దానికి తగ్గట్టు కచ్చితమైన నిలకడ గల ప్లాన్ ఉండాలని అభిప్రాయపడుతున్నారు. అప్పుడే క్లిక్ అవుతారని చెబుతున్నారు. ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టినా.. దాన్ని కంటిన్యూ చేయడం మామూలు విషయం కాదని.. అందులో సందీప్ సక్సెస్ అవ్వలేదని అంటున్నారు.

ముఖ్యంగా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మోగ్లీ రూపంలో మంచి అవకాశం ఇచ్చినా మిస్ చేసుకున్నారని చెబుతున్నారు. హిట్ కొట్టి ఉంటే.. మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు దక్కేవని అభిప్రాయపడుతున్నారు. దానికితోడు.. రిలీజ్ కు ముందు పెట్టిన పోస్ట్, చేసిన వ్యాఖ్యలతో వైరల్ అయినా.. అవుట్ పుట్ విషయంలో మాత్రం వైరల్ అవ్వలేకపోయారని అంటున్నారు.

Tags:    

Similar News