బయోపిక్స్ ఫలితాన్ని కోడి ముందే ఊహించారా!

Update: 2019-02-23 08:06 GMT
నిన్న దిగ్గజ దర్శకులు కోడి రామకృష్ణ అకాల మరణం చెందటం చిన్న పెద్ద తేడా లేకుండా పరిశ్రమనే కాదు సినిమాలు చూసే ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసింది. ఆయన జ్ఞాపకాలను గొప్ప సినిమాలను స్మరించుకుంటూ సోషల్ మీడియాలో సైతం నెటిజెన్లు ఘన నివాళులు అర్పించారు. కాని నిన్న ఎన్టీఆర్ మహానాయకుడు విడుదల. బాలకృష్ణకు మంగమ్మ గారి మనవడు-ముద్దుల మావయ్య లాంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు తన అభిమాన హీరోల్లో ఒకరైన బాలయ్య సినిమా రోజే పోవడం నందమూరి ఫ్యాన్స్ ని సైతం కలవరపరిచింది.

ఎందుకంటే 90వ దశకంలో బాలయ్య స్టార్ గా ఎదగడంలో కోడి సినిమాలు చాలా కీలక పాత్ర పోషించాయి. స్వతహాగా బయోపిక్ లను తీయడం గురించి కోడి రామకృష్ణ వ్యతిరేకి. ఇవి తీస్తే మహానుభావుల కథలను పూర్తిగా చూపించే స్వేచ్చ ఉండదని అందుకే ఇష్టం లేదని చెప్పారు. అయితే ఎన్టీఆర్ కథానాయకుడు గురించి తెలిసినప్పుడు మాత్రం నాన్నకు నిజమైన నివాళి ఇస్తున్న కొడుకుగా బాలకృష్ణకు అభినందనలు తెలిపాని చెప్పారు

తీరా రెండో భాగం మహానాయకుడు చూడకుండానే కన్ను మూసారు కోడి రామకృష్ణ. ఇదంతా విధి లిఖితం. ఎన్టీఆర్ బ్రతికున్నప్పుడు ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలన్న తపనతో కోడి రామకృష్ణ చాలా ప్రయత్నించారు. తాత మనవళ్ల బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ సబ్జెక్టు ఒకటి రాసుకుని వినిపించారు. సిఎంగా ఒత్తిళ్ళ మధ్య కథ నచ్చినా ఎన్టీఆర్ అది చేయలేకపోయారు. అందుకే భారత్ బంద్ ఫంక్షన్ కు కోడి పిలవగానే ఆయన గెస్ట్ గా వచ్చారు. ఇదంతా కోడి రామకృష్ణ స్వయంగా పంచుకున్న సంగతులే. తానెంతో అభిమానించే హీరో రాజకీయ కథ తెరమీదకు వచ్చిన రోజే అది చూడకుండానే కన్ను మూయడం చూస్తే ఇదే కదా జీవితం అంటే అని అనిపించక మానదు
Tags:    

Similar News