• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మూవీ రివ్యూ : కొబ్బరిమట్ట

మూవీ రివ్యూ : కొబ్బరిమట్ట

By - Tupaki Desk
Update: 2019-08-10 09:00 GMT
‘కొబ్బరిమట్ట’ మూవీ రివ్యూ
నటీనటులు: సంపూర్ణేష్ బాబు-ఇషికా-గాయత్రి గుప్తా-షకీలా-మహేష్ కత్తి తదితరులు
సంగీతం: సయీద్ కమ్రాన్
ఛాయాగ్రహణం: ముజీర్ మాలిక్
నిర్మాత: సాయిరాజేష్
కథ-స్క్రీన్ ప్లే-మాటలు: స్టీవెన్ శంకర్
దర్శకత్వం: రూపక్ రొనాల్డ్ సన్

ఐదేళ్ల కిందట ‘హృదయ కాలేయం’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసింది బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అండ్ టీం. ఇప్పుడు అదే టీం కలిసి చేసిన మరో సెటైరికల్ మూవీ ‘కొబ్బరిమట్ట’. అనేక అడ్డంకుల్ని దాటుకుని మొదలైన నాలుగేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ‘హృదయ కాలేయం’ మ్యాజిక్ ను పునరావృతం చేసిందో లేదో చూద్దాం పదండి.

కథ: తన తండ్రి పాపారాయుడు (సంపూర్ణేష్ బాబు)కు ఇచ్చిన మాటకు కట్టుబడి తన తమ్ముళ్లు, చెల్లెళ్లను బిడ్డల్లా చూసుకుంటూ.. గ్రామ పెద్దగా ఊరి జనాల్ని కూడా కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తూ జీవనం సాగిస్తుంటాడు పెదరాయుడు (సంపూర్ణేష్ బాబు). ఐతే పెదరాయుడు కొడుకునంటూ వచ్చిన ఆండ్రాయుడు (సంపూర్ణేష్ బాబు) ఊరి జనాల ముందు అతడి పరువు తీస్తాడు. తన కుటుంబ సభ్యులు సైతం తనను అనుమానించి అవమానించడంతో కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటికి వచ్చేస్తాడు పెదరాయుడు. తర్వాత అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఇంతకీ ఆండ్రాయుడు ఎవరు? పెదరాయుడు గొప్పదనాన్ని అతనెలా తెలుసుకున్నాడు? చివరికి పెదరాయుడు కుటుంబం ఎలా ఒక్కటైంది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: ‘కొబ్బరిమట్ట’ ప్రోమోల్లో భలే ఫన్నీ అనిపించింది ‘అఆఇఈ’ అనే పాట. అందులో సంపూ స్టెప్పులు.. హీరోయిన్లతో సయ్యాటలు సరదాగా అనిపించాయి. ఐతే సినిమా ముగింపు దశకు వస్తున్నా ఈ పాట కనిపించదు. పైగా ద్వితీయార్ధమంతా బోలెడంత సెంటిమెంటుతో సాగుతుంటుంది. పెదరాయుడు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంటాడు. ‘అఆఇఈ’ పాట రావడానికి తగ్గ సిచువేషన్ ఎక్కడా కనిపించదు. ఆ పాట ఇక సినిమాలో ఉండదేమో అన్న నిరాశ కలుగుతుంది. కానీ పెదరాయుడి భార్య కరెంటు షాకుకి గురై.. మృత్యువుతో పోరాడుతున్న దశలో ఈ పాట వస్తుంది. అలాంటి సిచువేషన్లో ఇలాంటి పాట ఏంటి అని ఆశ్చర్యం కలగొచ్చు. ఇందుకు సిచువేషన్ క్రియేట్ చేయడంలోనే రచయిత, దర్శకుల నేర్పు ఉంది. చివరగా తన కోసం ఒక పాట పాడమని భార్య అడిగితే.. పెదరాయుడు ‘ఎందరిని ఏ దరికి చేర్చినా’ అంటూ ట్రాజిక్ సాంగ్ అందుకుంటాడు. కానీ భార్య మాత్రం.. మీరు ఏ స్థితిలోనూ కన్నీళ్లు పెట్టకూడదు, మంచి ఊపున్న పాట పాడండి అంటుంది. వెంటనే ‘అఆఇఈ’ అంటూ ఫ్లోర్ మూమెంట్స్ ఉన్న సాంగ్ మొదలవుతుంది. ‘కొబ్బరిమట్ట’ సినిమా ఎలా సాగుతుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.

‘హృదయ కాలేయం’ సినిమా చూసిన ఎంజాయ్ చేసిన వాళ్లు.. ‘కొబ్బరిమట్ట’ ప్రోమోలు చూసి సినిమాలో ఏం ఉంటుందని అంచనా వేస్తారో దాన్నే అందిస్తుంది ఈ చిత్రం. కథ గురించి.. స్క్రీన్ ప్లే గురించి పెద్దగా చర్చించుకునే సినిమా కాదిది. అసలిందులో కథ అని చెప్పుకోవడానికేమీ లేదు. దీనికి ఒక నడత అంటూ ఉండదు. సిచువేషన్ ఏదైనా సరే.. సెటైర్లు, స్పూఫులతో ప్రేక్షకుల్ని నవ్వించడమే ధ్యేయంగా సాగుతుందీ చిత్రం. ప్రతి సన్నివేశంలోనూ కావాల్సినంత ‘అతి’ కనిపిస్తుంది. ఏ సన్నివేశం కుదురుగా కనిపించదు. ‘ఓవర్ ద టాప్’ స్టయిల్లో సాగిపోయే సన్నివేశాలు కోకొల్లలు. తమ్ముళ్లు ఎండలో చెప్పుల్లేకుండా నడుస్తూ ఇబ్బంది పడుతున్నారని.. వాళ్లు కాళ్లను భుజాల మీదికి వేసుకుని చేతులతో నడిపిస్తాడు పెదరాయుడు. తన తమ్ముడి జీవితంలో ప్రతి సందర్భంలోనూ తాను తోడుగా ఉన్నానని.. అతను శోభనం జరుపుకుంటుంటే కంగారు పడకుండా తోడుగా ఉందామని చాప-దిండు తీసుకుని గదిలోకి వెళ్లిపోతాడు. కష్టమైనా, సుఖమైనా కలిసి పంచుకోమని తండ్రి చెప్పాడు కాబట్టి ఒకే బ్రష్ తో తమ్ముళ్లందరికీ పళ్లు తోమిస్తాడు పెదరాయుడు. చెల్లెలికి పొయ్యి దగ్గర చేయి కాలిందని.. మిగతా అందరికీ కూడా వాతలు పెడతాడు. నువ్వెందుకు వాత పెట్టుకోలేదన్నయ్యా అంటే.. మీ బాధ నా బాధ కాదా అంటాడు. సినిమా అంతటా ఇలాంటి సన్నివేశాలే ఉంటాయి.

తెలుగు సినిమాల్లో మితిమీరిన హీరోయిజం.. నాటకీయతపై సెటైర్లు, స్పూఫులతో సాగిపోయే సినిమా ‘కొబ్బరిమట్ట’. ఈ టైపు సినిమాల్ని ఎంజాయ్ చేయగలిగే వాళ్లను సినిమాలోని కొన్ని సీన్లు నవ్విస్తాయి. అలా కాని పక్షంలో ఇదొక సిల్లీ సినిమాగా అనిపించే అవకాశమూ ఉంది. ‘కొబ్బరిమట్ట’ ఎవరికెలాంటి అనుభూతిని కలిగిస్తుందన్నది వాళ్ల అభిరుచిని బట్టి ఉంటుంది. ఐతే ఈ సినిమాకు లిమిటేషన్స్ ఏమీ లేవు కాబట్టి.. లాజిక్కులతో సంబంధం లేకుండా ఏమైనా రాసే.. తీసే అవకాశం ఉన్నపుడు రచయిత.. దర్శకుడు ఇంకొంచెం ఎక్స్ ట్రీమ్ గా వెళ్లడానికి అవకాశం ఉండి కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారు. పేరడీ చేయాలనుకున్నపుడు ఎప్పుడో రెండు దశాబ్దాల కిందట వచ్చిన ‘పెదరాయుడు’ను కాకుండా గత కొన్నేళ్లలో వచ్చిన ఏ ‘బాహుబలి’ లంటి సినిమాలనో టార్గెట్ చేసుకుని ఉంటే ఇప్పటి ప్రేక్షకులు మరింత కనెక్టవ్వడానికి అవకాశం ఉండేది. ‘జబర్దస్త్’ లాంటి ప్రోగ్రామ్స్ లో బోలెడన్ని స్పూఫులు.. పేరడీలు చూస్తున్న నేపథ్యంలో ఇలాంటి కొన్ని స్కిట్లు కలిపినట్లుగా ఉండే ‘కొబ్బరిమట్ట’ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న సందేహాలూ లేకపోలేదు. కాకపోతే ఇక్కడ సంపూ ఉన్నాడు కాబట్టి అతడి మార్కు వినోదాన్ని చూడాలనుకునేవాళ్లు ‘కొబ్బరిమట్ట’పై ఓ లుక్కేయొచ్చు.

నటీనటులు: సంపూను అభినందించాల్సిందే. మూడున్నర నిమిషాల పాటు నిర్విరామంగా చెప్పిన డైలాగ్ దగ్గర కావచ్చు.. వరుణుడిని కరిగించేందుకు గజ్జె కట్టి నృత్యం చేసే చోట కావచ్చు.. ‘అఆఇఈ’ పాటలో స్టార్ హీరోలకు దీటుగా స్టెప్స్ వేయడంలో కావచ్చు.. అతను తన వంతుగా బాగానే ఎంటర్టైన్ చేశాడు. దాని వెనుక అతడి కష్టాన్ని కూడా అభినందించాల్సిందే. సినిమాను దాదాపుగా తన భుజాల మీద నడిపించాడు సంపూ. మహేష్ కత్తి.. షకీలా ఆకట్టుకున్నారు. మిగతా పాత్రధారులూ వారి పరిధిలో బాగానే చేశారు.

సాంకేతికవర్గం: టెక్నీషియన్స్ అందరూ సినిమా థీమ్ కు తగ్గ ఔట్ పుట్ ఇచ్చారు. కమ్రాన్ పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. ‘అఆఇఈ’ కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ముజీర్ మాలిక్ ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు అంత గొప్పగా అనిపించవు కానీ.. ఈ చిత్రానికి ఉన్న పరిమితుల దృష్ట్యా మన్నించొచ్చు. సాయిరాజేష్ (స్టీవెన్ శంకర్) కథ.. స్క్రీన్ ప్లే అంతా మామూలే కానీ.. డైలాగులు చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి. సినిమాకు అతి పెద్ద బలం అవే. అతను రాసిన కామెడీ ఎపిసోడ్లు కొన్ని బాగానే పేలాయి. దర్శకుడు రూపక్ రొనాల్డ్ సన్.. పర్వాలేదనిపించాడు.

చివరగా: కొబ్బరిమట్ట.. ఇది సంపూ ‘జబర్దస్త్’

రేటింగ్- 2.25/5
Tags:    
  • Kobbari matta Review 
  • Kobbarimatta Movie Review 
  • Sampoornesh Babu 
  • KobbariMatta Story 
  • BurningStar 
  • SampoorneshBabu 
  • Review 
  • Telugu Reviews 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS