సాధార‌ణ ఆహ‌రం క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఇదంతా సాధించాడ‌ట‌!

Update: 2020-11-27 04:15 GMT
ఇటీవ‌లి కాలంలో ఎంచుకున్న‌ పాత్ర‌లోకి ప‌ర‌కాయం చేసేందుకు మ‌న హీరోలు రూపాన్ని మార్చుకుంటున్న తీరు ఆస‌క్తిని క‌లిగిస్తోంది. అప్ప‌టిక‌ప్పుడు 6 ప్యాక్ లుక్ కోసం జిమ్ముల్లో క‌ఠోరంగా శ్ర‌మిస్తున్నారు. అవ‌స‌రం లేదు అనుకుంటే తిరిగి సాధార‌ణ స్థితికి రూపాన్ని తెచ్చేస్తున్నారు. అయితే ఇది అంత సులువైన ప‌నా? అంటే కానే కాదు.

దీనికి ఎంతో నిబ‌ద్ధ‌త క్ర‌మ‌శిక్ష‌ణ కావాలి. దానికి తోడు ఆహారం ప‌రంగా ఎన్నో జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం. ఏది ప‌డితే అది తినేస్తే కండ‌లు పెర‌గ‌వు. డైటీషియ‌న్ చెప్పిన‌వి తింటూ జిమ్ కోచ్ చార్ట్ ని ఫాలో అయితేనే అది సాధ్యం. ఇటీవ‌ల తెలుగులో యువ‌హీరోలంతా మేకోవ‌ర్ ట్రై చేస్తున్న తీరు ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

ఈగ ఫేం సుదీప్ 40 ప్ల‌స్ ఏజ్ లోనూ ఈ త‌ర‌హాలోనే మేకోవ‌ర్ ట్రై చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సుదీప్ ఇటీవ‌లే స‌ల్మాన్ ఖాన్ తో పోటీప‌డుతూ ద‌బాంగ్ 3 కోసం గొప్ప మేకోవ‌ర్ ట్రై చేశాడు. ఇప్పుడు ఫాంట‌మ్ మూవీ కోసం ఏకంగా భారీ కాయుడిగా మారాడు. ఎంతో కష్టపడి,.. అంకితభావంతో ట్రై చేస్తేనే ఇది సాధ్యం. ఇది సాధించ‌డానికి సుదీప్ ఒక సాధారణ రెసిపీని అనుస‌రించాడ‌ట‌. బాగా మంచి నీళ్లు తాగాడ‌ట‌.

మంచి ఆహారం.. మంచి జీవనశైలి .. కొద్దిగా క్రమశిక్షణ అవ‌స‌రం అని సుదీప్ చెబుతున్నాడు. ఇదంతా ‘ఫాంటమ్’ మూవీ  క్లైమాక్స్ కోసమేన‌ట‌. 2020 డిసెంబర్ 4 నుండి చివరి షెడ్యూల్ ని చిత్రీక‌రించ‌నున్నారు. సుదీప్ మేకోవ‌ర్ చూస్తుంటే ఫాంట‌మ్ పై అనూహ్యంగా అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఈ మూవీని పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ చేసేందుకు టీమ్ స‌న్నాహాలు చేస్తోంద‌ట‌.

Tags:    

Similar News