పక్కా!! మహేష్‌ పక్కన బికినీ భామే..

Update: 2017-04-18 04:22 GMT
కొరటాల శివ డైరక్షన్లో మహేష్‌ బాబు చేయనున్న ''భరత్ అను నేను'' సినిమా త్వరలోనే మొదలవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవర్ని పిక్ చేస్తారు అనే విషయంలోనే ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు. అయితే ఈ సినిమా మేకర్లు ఎట్టకేలకు ఒక బాలీవుడ్ భామే కన్ఫామ్ అంటూ ఇప్పుడు కొన్ని ఫీలర్లు బయటకు వచ్చేశాయి.

నిజానికి ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలో రకుల్ చేస్తోందంటూ నిన్న సడన్ గా కొన్ని రూమర్లు పుట్టుకొచ్చాయ్. ఇంకా మురుగుదాస్ సినిమాలో ఆమెతో పండించిన కెమిస్ర్టీ ఎలా ఉంది అనే విషయంపై అసలు ఎటువంటి ఫీడ్ బ్యాక్ రాకుండానే.. మహేష్‌ మళ్ళీ ఆమెను టాక్ వచ్చిందిలే. కాని అప్పుడే సడన్ గా కొన్ని పి.ఆర్.ఏజన్సీలో రంగంలోకి దిగి.. మహేష్‌ సినిమా చేయడానికి మ్యాగ్జిమ్ బికినీ బ్యూటి కియారా అద్వాని ఒప్పుకుందని సంకేతాలు పంపేశారు.

ఒప్పుకోవడం ఏముందిలే.. అసలు అమ్మడుకి బాలీవుడ్ లో పెద్దగా ఇరగ్గొట్టేసే ఛాన్సులే లేవు. పైగా ఈమె గ్లామరసంతో అక్కడేం సెన్సేషన్లు సృష్టించలేదు. అలాంటి సమయంలో మహేష్‌ బాబు సినిమా అంటే ఎగురుకుంటూ వచ్చేసుంటుంది. బాలీవుడ్లో ధోని సినిమా వంటి పెద్ద హిట్టు ఇవ్వలేని బ్రేక్.. టాలీవుడ్ లో ఈ హాట్ అద్వానీకి మహేష్‌ ఇస్తాడేమో చూద్దాం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News