కాజల్ 'కోస్టి' సినిమా ట్రైలర్ చూశారా?
టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ప్రేక్షకులనూ దాదాపు పుష్కర కాలం పాటు ఎంటర్ టైన్ చేసిన ముద్దుగుమ్మ కాజల్ అగ్వల్. ఈ అమ్మడు పెళ్లి చేసుకుని తల్లిగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. పెళ్లి తర్వాత ఈ అమ్మడు టాలీవుడ్ లో బాలయ్య సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలయ్య.. అనిల్ రావిపూడి కాంబో సినిమాలో కాజల్ నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక ఈ అమ్మడు తమిళంలో నటించిన సినిమాను కోస్టి గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. హర్రర్ కామెడీ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందనే నమ్మకం తాజాగా విడుదలైన ట్రైలర్ ను చూస్తూ ఉంటే కలుగుతోంది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన పలువురు కమెడియన్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు.
భయపడే పోలీస్ పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించబోతుంది. దెయ్యాలంటే భయపడే కాజల్ అగర్వాల్ ను కొన్ని కారణాల వల్ల దెయ్యాలు వెంటాడుతాయి. ఆ దెయ్యాలు ఏంటీ.. వాటి నుండి కాజల్ అగర్వాల్ అండ్ టీమ్ ఎలా తప్పించుకున్నారు అనే విషయాన్ని సినిమాలో చూపించబోతున్నారు.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తో పాటు కేఎస్ రవికుమార్.. యోగి బాబు.. ఊర్వసి.. సత్యన్.. మనోబాల ఇంకా పలువురు తమిళ స్టార్ నటీ నటులు కనిపించబోతున్నారు. ఈ సినిమాను మార్చి 17వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించారు. పెద్ద సినిమాల పోటీ లేని కారణంగా కాజల్ కోస్టి సినిమా ప్రేక్షకులను భయపెట్టి మంచి వసూళ్లను సాధిస్తుందేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View