పెద్ది ఖాతాలో సరికొత్త రికార్డు
ఇక అసలు విషయానికొస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా నుంచి రీసెంట్ గా చికిరి అనే లిరికల్ సాంగ్ వచ్చిన సంగతి తెలిసిందే.;
ఏ సినిమా అయినా ఆడియన్స్ లోకి వెళ్లాలంటే దానికి ఆడియో ఎంతో ముఖ్యం. ఆడియో బావుంటే ఎన్నో సినిమాలకు రిలీజ్ కు ముందు విపరీతమైన బజ్ రావడం చూశాం. అదే సినిమాలోని పాటలు సరిగా లేకపోతే ఎంత పెద్ద సినిమా మీదైనా సరే భారీ ఆసక్తి కలగదు. ఈ నేపథ్యంలోనే చిత్ర మేకర్స్ తమ సినిమాల్లోని సాంగ్స్ ను ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి ఎన్నెన్నో చేస్తున్నారు.
తెలుగులోనే 100 మిలియన్ల వ్యూస్
ఇక అసలు విషయానికొస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా నుంచి రీసెంట్ గా చికిరి అనే లిరికల్ సాంగ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ రిలీజైన తక్కువ టైమ్ లోనే చార్ట్ బస్టర్ గా నిలవగా ఇప్పుడు చికిరి పాట ఓ సరికొత్త రికార్డును సృష్టించింది. చికిరి సాంగ్ కేవలం తెలుగు భాషలోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది.
స్పెషల్ ఎట్రాక్షన్ గా చరణ్ స్టెప్పులు
ఏఆర్ రెహమాన్ సంగీతంలో వచ్చిన ఈ పాట రిలీజైనప్పటి నుంచే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకోగా ఈ సాంగ్ కు అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్లకు పైగా వ్యూస్ ను అందుకుని గ్లోబల్ లెవెల్ లో గుర్తింపును అందుకుంది. రెహమాన్ ట్యూన్ మాత్రమే కాకుండా ఈ సాంగ్ లో చరణ్ వేసిన స్టెప్పులు చికిరి సాంగ్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.
ఆ స్టెప్పుల వల్లే చికిరి సాంగ్ రిలీజైనప్పటి నుంచి సోషల్ మీడియాలో పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ స్టెప్పులేస్తూ ఆ సాంగ్ ను నెట్టింట వైరల్ చేస్తున్నారు. కేవలం ఒక్క చికిరి సాంగ్ తోనే పెద్ది సినిమాపై ఆడియన్స్ కు అంచనాలు విపరీతంగా పెరిగాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని చరణ్ ఎంతో కసిగా ఉన్నారు.