దర్శకులకు ఖరీదైన బహుమతులు ఇచ్చిన హీరోలు వీళ్లే!

ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఓజీ చిత్ర దర్శకుడు సుజిత్ కి ఖరీదైన కారును బహుమతిగా అందించారు.;

Update: 2025-12-16 10:10 GMT

ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా సరే ఎవరైనా చేసిన పని తమకు మెచ్చుదల అనిపిస్తే.. ఎదుటివారు కచ్చితంగా వారికి ఖరీదైన వస్తువులను కానుకగా ఇస్తూ ఉంటారు. అయితే ఈ విషయాలు పెద్దగా తెలియకపోయినా.. సినీ సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వారికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే.. ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. అందులో భాగంగానే హీరోలు సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఎవరైనా ఒక డైరెక్టర్ ఆ హీరోతో సినిమా చేసి గ్రాండ్ సక్సెస్ అందుకుంటే మాత్రం.. వారికి ఏదో ఒక రూపంలో ఖరీదైన బహుమతులను ఇస్తూ ఉంటారు హీరోలు. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు తమకు మంచి సక్సెస్ అందించిన దర్శకులకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలుస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఓజీ చిత్ర దర్శకుడు సుజిత్ కి ఖరీదైన కారును బహుమతిగా అందించారు. విషయంలోకి వెళ్తే.. ఇటీవల పవన్ కళ్యాణ్ తో ప్రముఖ డైరెక్టర్ సుజిత్ ఓజీ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్ అవడంతో తనను వెండితెరపై అంత పవర్ ఫుల్ గా చూపించి భారీ హిట్ ను బహుమతిగా ఇచ్చిన సుజీత్ కి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకంగా రెండు కోట్ల విలువైన రేంజ్ రోవర్ డిఫెండర్ కారును రిటర్న్ గిఫ్ట్ గా అందించారు..పవన్ కళ్యాణ్ స్వయంగా డైరెక్టర్ సుజీత్ కి కారు కీస్ అందజేస్తూ అభినందించారు. ఈ విషయాన్ని సుజిత్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా గతంలో కొంతమంది హీరోలు కూడా ఇలా దర్శకులకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం.

సాయి దుర్గా తేజ్ - కార్తీక్ వర్మ:

యాక్సిడెంట్ తర్వాత విరామం తీసుకుని సాయి దుర్గ తేజ్ నేరుగా చేసిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమా ద్వారా సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఈ సినిమా ఏకంగా 100 కోట్ల క్లబ్లో చేరింది. అటు థియేటర్లలోనే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమా హీరో సాయి దుర్గా తేజ్ డైరెక్టర్ కార్తీక్ వర్మాకి సుమారుగా 70 లక్షల విలువైన బెంజ్ కారును బహుమతిగా అందించారు.

నితిన్ -వెంకీ కుడుముల:

ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల పుట్టినరోజు సందర్భంగా హీరో నితిన్ కూడా ఒక అద్భుతమైన రేంజ్ రోవర్ కారును బహుమతిగా అందించారు. వీరిద్దరి కాంబినేషన్లో విడుదలైన భీష్మ సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించడమే కాకుండా నితిన్ కి మంచి సక్సెస్ అందించడంతో.. రిటర్న్ గిఫ్ట్ గా నితిన్.. వెంకీ కుడుములకు కారు బహుమతిగా ఇచ్చారు

నాని -రామ్ జగదీష్:

ఒకవైపు హీరోగా.. మరొకవైపు నిర్మాతగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న నాని.. కోర్ట్ అనే మూవీని నిర్మించి, మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన రామ్ జగదీష్ కి నాని కారును బహుమతిగా అందించారు. ఇకపోతే ఈ విషయంపై రామ్ జగదీష్ మాట్లాడుతూ.. నానికి ఇచ్చిన బహుమతులు బయటకు చెప్పుకోవడం ఇష్టం లేదు. అందుకే ఎవరికి చెప్పలేదు అంటూ రామ్ జగదీష్ గతంలో తెలిపారు

మహేష్ బాబు - కొరటాల శివ:

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన చిత్రం శ్రీమంతుడు. ఈ సినిమా మహేష్ బాబుకు ఎంత సక్సెస్ అందించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సక్సెస్ తో ఉబ్బితబ్బిబ్బైన మహేష్ బాబు.. దర్శకుడు కొరటాల శివకు ఆడి ఏ6 కారును బహుమతిగా అందించారు.

Tags:    

Similar News