హీరోయిన్సే టార్గెట్.. ముదురుతున్న వివాదం!

అయితే ఇలాంటి మాటలు పడలేక కొంతమంది సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇస్తే.. మరి కొంతమంది చూసి చూడనట్టు వదిలేస్తారు.;

Update: 2025-12-16 10:58 GMT

హీరోయిన్ అయితే సరిపోదు.. ఆమె అందం, అపురూప లావణ్యం అభిమానులను మెప్పించగలగాలి..తన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకోవాలి. ముఖ్యంగా ఆమె ముఖ కవళికలు, శరీర వర్చస్సు చూపరులను ఆకట్టుకోవాలి. అప్పుడే ఆ సెలబ్రిటీకి ఇండస్ట్రీలో అభిమానులు పట్టం కడతారు. ఆమె అందానికి దాసోహం అవుతారు. వరుసగా అవకాశాలు కూడా వస్తాయి. అందుకే హీరోయిన్స్ తమ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి కష్టమైన వర్కౌట్స్ చేయడమే కాకుండా సర్జరీలు కూడా చేయించుకొని తమ శరీర భాగాలకు ఒక ఆకృతిని కలుగజేస్తూ ఉంటారు.

అయితే మరి కొంతమంది పుట్టుకతోనే సౌందర్యవతులుగా జన్మిస్తే.. మరికొంతమంది కష్టమైన వర్కౌట్స్ చేసి తమ శరీర ఆకృతిని మార్చుకుంటూ ఉంటారు. అయినా సరే ఇవేవీ పట్టించుకోకుండా కొంతమంది ఆకతాయిలు ఆ సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టేలా కామెంట్లు చేయడమే కాకుండా వారి ఫేస్ ప్లాస్టిక్ సర్జరీ అంటూ హేళన చేసేలా మాటలు మాట్లాడుతూ వారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు.

అయితే ఇలాంటి మాటలు పడలేక కొంతమంది సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇస్తే.. మరి కొంతమంది చూసి చూడనట్టు వదిలేస్తారు. అయితే అందం అనేది ఒక హీరోయిన్స్ విషయంలోనే కాదు హీరోల విషయంలో కూడా.. హీరోలు కూడా తమ ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడం కోసం ఇప్పటికే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వారు కూడా ఉన్నారు. అయితే వీరిని ఎవరిని ఏమీ అనరు.. కానీ ఈ ఆకతాయిలు టార్గెట్ హీరోయిన్స్ మాత్రమే. ఎక్కువగా వారినే టార్గెట్ చేస్తూ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు అంటూ లేనిపోని అపోహలు సృష్టిస్తూ.. అభిమానులలో వీరిపై వ్యతిరేకత కలిగేలా చేస్తున్నారనడంలో సందేహం లేదు.

అలా ఇప్పటికే కొంతమంది హీరోయిన్లను టార్గెట్ గా చేస్తూ ఒక ఇంస్టాగ్రామ్ ఐడి ద్వారా పదుల సంఖ్యలో వీడియోలు వైరల్ గా మారాయి. అందులో రకుల్ ప్రీత్ సింగ్ వీడియో కూడా బయటకు రావడంతో ఆమె ఒక్కసారిగా మండిపడింది. విషయంలోకి వెళ్తే.. రకుల్ శరీర మార్పులకు కారణం ప్లాస్టిక్ సర్జరీ అంటూ ఒక వ్యక్తి రిలీజ్ చేసిన వీడియో పై రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. "వైద్యులమని చెప్పుకునే ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

నేను సాంప్రదాయ వైద్యంతో పాటు ఆధునిక చికిత్సలను కూడా నమ్ముతాను. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సర్జరీలు చేయించుకున్నా కూడా నేను తప్పుపట్టను. ఎందుకంటే అది వారి పూర్తి వ్యక్తిగత విషయం. కష్టపడి వ్యాయామం చేసినా బరువు తగ్గొచ్చనే విషయాన్ని ఇలాంటి వాళ్లు ఎందుకు ఆలోచించరో అర్థం కావడం లేదు" అంటూ తెలిపింది.

ఇకపోతే సదరు వ్యక్తి ఇలా పోస్ట్ పెట్టడానికి కారణం ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు రకుల్ ముఖం పూర్తిగా మారిపోవడమే.. అందుకే ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అంటూ ఇంస్టాగ్రామ్ లో ఒకరు వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఎన్ని వ్యాయామాలు చేసిన ఫలితం లేకపోవడం వల్ల సర్జరీ చేయించుకుందని చెప్పడంతోనే రకుల్ ఈ విధంగా స్పందించింది.

ఇకపోతే ఆ ఇంస్టాగ్రామ్ ఖాతాలో అనన్య పాండే, నోరా పతేహీ, ఊర్వశీ రౌతేలా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి హీరోయిన్లు సర్జరీ చేయించుకున్నట్లు తెలుపుతున్న వీడియోలు కూడా ఉండడం గమనార్హం. ఏది ఏమైనా హీరోయిన్లను టార్గెట్ చేస్తూ చేస్తున్న ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో నెటిజన్స్ హీరోయిన్స్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వారు ఏమి అనలేరని కదా? అని కొంతమంది కామెంట్లు చేస్తే.. ఇంకొంతమంది హీరోలు కూడా సర్జరీలు చేయించుకుంటున్నారు కదా? ఈ విషయాన్ని ఎందుకు హైలెట్ చేయడం లేదు? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ప్లాస్టిక్ సర్జరీ వివాదం ఇప్పుడు ముదురుతోంది అనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News