కపిల్ శర్మ రొమాంటిక్ అవతారం.. త్రిధాతో యమ ఘాటుగా..
కామెడీ కింగ్ కపిల్ శర్మ అంటే అందరికీ కామెడీ పంచ్ లు, సెటైర్లు గుర్తొస్తాయి. ఆయన షో చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే. కానీ ఇప్పుడు కపిల్ శర్మ రూట్ మార్చాడు.;
కామెడీ కింగ్ కపిల్ శర్మ అంటే అందరికీ కామెడీ పంచ్ లు, సెటైర్లు గుర్తొస్తాయి. ఆయన షో చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే. కానీ ఇప్పుడు కపిల్ శర్మ రూట్ మార్చాడు. మైక్ పట్టుకొని జోకులు వేయడమే కాదు, హీరోయిన్ తో కలిసి స్టెప్పులు కూడా వేయగలనని నిరూపిస్తున్నాడు. లేటెస్ట్ గా విడుదలైన 'ఆజా హల్ చల్ కరేంగే' అనే పాటలో కపిల్ శర్మను చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇందులో ఆయన చేసిన డ్యాన్స్, చూపించిన రొమాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ పాటలో కపిల్ శర్మకు జోడిగా త్రిధా చౌదరి నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్ మీద అదిరిపోయింది. ముఖ్యంగా వైట్ డ్రెస్ లో త్రిధా గ్లామర్ ఒలకబోస్తుంటే, కపిల్ శర్మ స్టైలిష్ లుక్ లో ఆమెతో పోటీ పడి మరీ డ్యాన్స్ చేశాడు. ఇన్నాళ్లు కేవలం మాటలతోనే మాయ చేసిన కపిల్, ఇప్పుడు తనలోని లవర్ బాయ్ ని బయటకు తీశాడు.
పాట విషయానికి వస్తే, బీట్ చాలా హుషారుగా ఉంది. 'సయ్యారా సయ్యారా' అంటూ సాగే ఈ పాటలో ఎనర్జీ హైలెవెల్ లో ఉంది. సెట్టింగ్ కూడా చాలా కలర్ ఫుల్ గా, ఒక డిఫరెంట్ లుక్ తో డిజైన్ చేశారు. లైటింగ్స్, కాస్ట్యూమ్స్ అన్నీ చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి. కపిల్ శర్మ బాడీ లాంగ్వేజ్ లో కూడా చాలా మార్పు కనిపిస్తోంది. ఒక ప్రొఫెషనల్ హీరోలా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ రెచ్చిపోయాడు.
సాధారణంగా కపిల్ శర్మ సినిమాల్లో నటించినా అందులో కామెడీ టచ్ ఉంటుంది. కానీ ఈ ఆల్బమ్ సాంగ్ లో మాత్రం ఆయన పక్కా కమర్షియల్ హీరోలా కనిపించాడు. త్రిధాతో ఆయన చేసిన రొమాంటిక్ సీన్స్ చూస్తుంటే ఇది మన కపిల్ శర్మేనా అనిపిస్తుంది. అంతలా మారిపోయాడు. మొత్తానికి కపిల్ శర్మ చేసిన ఈ కొత్త ప్రయోగం సక్సెస్ అయ్యేలా ఉంది. కామెడీ మాత్రమే కాదు రొమాన్స్, డ్యాన్స్ కూడా చేయగలనని ఈ పాటతో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ హల్ చల్ ఇప్పుడు నెట్టింట్లో గట్టిగానే సౌండ్ చేస్తోంది. మరి రాబోయే రోజుల్లో కపిల్ నుంచి ఇలాంటి సర్ ప్రైజులు ఇంకా ఎన్ని వస్తాయో చూడాలి.