వీకెండ్ వైబ్స్.. తల్లైనా తరగని అందం..
తాజాగా తాను వీకెండ్ లో తీసుకున్న ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వీకెండ్ వైబ్స్ అంటూ క్యాప్షన్ కూడా జోడించింది.;
అలియా భట్.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీగా సినీ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. నేచురల్ బ్యూటీగా పేరు సొంతం చేసుకుంది. తన అందం, అభినయంతో పాటు యాక్షన్ పర్ఫామెన్స్ తో హీరోలతో సమానంగా పోటీపడుతూ సినిమాలు చేస్తోంది.అంతేకాదు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో ఒకరిగా స్థానం సంపాదించుకుంది. హిందీలోనే కాదు ఇటీవల తెలుగులో కూడా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఆలియా భట్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ కు జోడిగా సీత పాత్రలో నటించి, తన అద్భుతమైన నటనతో తెలుగు అభిమానుల హృదయాలను దోచుకుంది.
కెరియర్ పీక్స్ లో ఉండగానే ప్రముఖ నటుడు రణబీర్ కపూర్ తో ఏడడుగులు వేసిన ఈమె.. అదే ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపకు రాహా అని నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల తన కూతురికి నవంబర్లో పుట్టినరోజు వేడుకలను జరిపిన ఈ జంట.. రాహా కోసం ప్రత్యేకంగా నిర్మించిన 350 కోట్ల విలువైన విల్లాలోకి అడుగుపెట్టారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆలియా షేర్ చేసిన విషయం తెలిసిందే. అలా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకునే ఈమె.. తాజాగా మరో ఔట్ ఫిట్ లో దర్శనమిచ్చి అభిమానులను సర్ప్రైజ్ చేసింది.
తాజాగా తాను వీకెండ్ లో తీసుకున్న ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వీకెండ్ వైబ్స్ అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. బ్లాక్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చిన ఈమె సింపుల్ గా వైట్ స్టోన్స్ పొదిగిన నెక్ చౌకర్ తో తన మెడను ఫుల్ ఫిల్ చేసింది. ఇక సింపుల్ లుక్ లో తన మేని ఛాయను రెట్టింపు చేసుకుంది ఆలియా భట్. ప్రస్తుతం ఆలియా భట్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన ఫాలోవర్స్ ఈ ఫోటోల కోసం ఎప్పటినుంచి ఎదురుచూస్తున్నామో నీకు తెలుసా? అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది మనలో కాన్ఫిడెంట్ పెరగాలి అంటే బ్లాక్ పర్ఫెక్ట్ ఛాయిస్ అంటూ కామెంట్ చేశారు. ఇంకొంతమంది తల్లి అయినా ఈమెలో ఏమాత్రం అందం తగ్గడం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా ఆలియా ధరించిన ఈ బ్లాక్ అవుట్ ఫిట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది అనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం సంజయ్ లీలా దర్శకత్వంలో లవ్ అండ్ వార్ అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే శివ్ రావైల్ దర్శకత్వంలో వస్తున్న ఆల్ఫా అనే సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే బ్రహ్మాస్త్ర సీక్వెల్స్ లో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.