ది ప్యారడైజ్ యూనివర్స్.. ఏం చేస్తున్నారో..?

అదే జరిగితే మాత్రం నాని సినిమా మరింత ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. నాని ది ప్యారడైల్ లో క్యారెక్టరైజేషన్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని టాక్.;

Update: 2025-12-16 10:30 GMT

దసరాతో తొలి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. నాని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసి నానికి అప్పటివరకు ఉన్న క్లాస్ ఇమేజ్ ని సైతం డామినేట్ చేసేలా దసరా తీసి సక్సెస్ అందుకున్నాడు. ఇక తన సెకండ్ సినిమా కూడా ది ప్యారడైజ్ అంటూ ఒక డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా నాని కెరీర్ లోనే హైయ్యెస్ట్ అనేస్తున్నారు. ది ప్యారడైజ్ సినిమాలో నాని జడల్ రోల్ లో నటిస్తున్నారు. సినిమాలో విలన్ గా మోహన్ బాబు చేస్తున్నారు.

శ్రీకాంత్ ఓదెల సినిమాటిక్ యూనివర్స్..

ది ప్యారడైజ్ ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ కి సూపర్ హై ఇస్తుంది. ఐతే ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల తన సినిమాటిక్ యూనివర్స్ లా ప్లాన్ చేస్తున్నాడా అన్న డౌట్ రేజ్ అవుతుంది. దసరాతో సంబంధం ఉండకపోవచ్చు కానీ ది ప్యారడైజ్ తో శ్రీకాంత్ తన సినిమాటిక్ యూనివర్స్ ని ఏర్పాటు చేసే ప్లాన్ లో ఉన్నాడని టాక్.

ఈమధ్య కొంతమంది దర్శకులు సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఒక సెపరేట్ ట్రెండ్ సృష్టిస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ నుంచి తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మ వరకు ఈ సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇదే దారిలో శ్రీకాంత్ ఓదెల కూడా ది ప్యారడైజ్ తో తన సినిమాటిక్ వరల్డ్ అదే యూనివర్సిటీ ప్లానింగ్ ఉందని అంటున్నారు.

ది ప్యారడైజ్ నాని కి జోడీగా ఎవరు..

అదే జరిగితే మాత్రం నాని సినిమా మరింత ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. నాని ది ప్యారడైల్ లో క్యారెక్టరైజేషన్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని టాక్. సినిమాలో నాని కి జోడీగా ఎవరు నటిస్తున్నారు అన్నది సస్పెన్స్ గానే ఉంది. నాని ఫ్యాన్స్ మాత్రం ది ప్యారడైజ్ దసరా కాదు అంతకుమించి మ్యాజిక్ చేస్తుందని ఫిక్స్ అయ్యారు.

నెక్స్ట్ ఇయర్ మార్చి 26న శ్రీకాంత్ ఓదెల నాని ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు పోటీగా పెద్ది వస్తుంది. చరణ్ తో ఫైట్ కి నాని ది ప్యారడైజ్ విషయంలో ఎక్కడ తగ్గట్లేదని టాక్. తెలుస్తుంది. నాని ది ప్యారడైజ్ తో మరోసారి తన మాస్ ఇంపాక్ట్ చూపించాలని చూస్తున్నారు. ఈ సినిమాతో నాని పాన్ ఇండియా లెవెల్ లో తన క్రేజీ అటెంప్ట్ చేయబోతున్నాడు. నాని ది ప్యారడైజ్ తర్వాత శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా లాక్ చేసుకున్నాడు. ప్యారడైజ్ యూనివర్సిటీ నిజమే అయితే చిరు సినిమాకు ఈ సినిమాకు లింక్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. అదే జరిగితే మాత్రం ఆడియన్స్ కి మెగా ఫీస్ట్ గ్యారెంటేఎ అని చెప్పొచ్చు.

Tags:    

Similar News