ఖైదీ కాయిన్ ఫైట్ మేకింగ్ వీడియో

Update: 2017-01-06 04:22 GMT
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదల దగ్గర పడే కొద్దీ అంచనాలను ఇంచు ఇంచు పెంచుకుంటూపోతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు మంచి ఫీడ్ బ్యాక్ ని అందుకోగా రేపు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విడుదల చెయ్యబోయే ట్రైలర్ పై అందరి కళ్ళూ దృష్టిపెట్టాయి.

అయితే ట్రైలర్ కంటే ముందు ఒక చిన్న మేకింగ్ వీడియోని విడుదల చేసింది ఖైదీ టీం. సినిమాలో ముఖ్యమైన ''కాయిన్'' ఫైట్ ఎపిసోడ్ ని తనదైన శైలిలో చిన్న మార్పులు చేసి బాగా చిత్రీకరించామని వినాయక్ ఇప్పటికే తెలిపాడు. ఇప్పుడు ఆఫైట్ మేకింగ్ వీడియోని విడుదల చేశారు.

రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఈ ఫైట్ సీక్వెన్స్ అదిరిపోనుందని సమాచారం. ఇప్పటిదాకా విడుదల చేసిన రఫ్ స్టిల్స్ అన్నీ ఈ ఫైట్ లోనివే. చిరు ఇంటెన్సిటీ చూస్తుంటే ఒరిజినల్ కంటే ఒక మెట్టు పైనే నిలిచేటట్టు తెలుస్తుంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Full View




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News