• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఐఎండిబి 2022 టాప్ 10లో...

ఐఎండిబి 2022 టాప్ 10లో KGF2 - RRR

By - Tupaki Desk
Update: 2022-07-14 04:31 GMT
పాపుల‌ర్ వెబ్ IMDB లో చోటు ద‌క్కితే ఆ సినిమాకి ఉండే క్రేజ్ వేరు.  ఐఎండీబీ అంటే అర్థం- ఇంటర్నెట్ మూవీ డేటాబేస్. 2022 ప్రథమార్ధంలో టాప్ 10 అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చలనచిత్రాలు .. వెబ్ సిరీస్ ల జాబితాను తాజాగా ఐఎండీబీ విడుదల చేసింది.  వివేక్ అగ్నిహోత్రి 'ది కాశ్మీర్ ఫైల్స్'... MX ప్లేయర్ వెబ్ సిరీస్ 'క్యాంపస్ డైరీస్' జాబితాలో అగ్ర స్థానాన్ని అలంక‌రించాయి.

2022 ఉత్త‌మ సినిమాల జాబితాలో 'ది కాశ్మీర్ ఫైల్స్' ఈ సంవత్సరం ఆశ్చర్యకరంగా టాప్ పొజిష‌న్ కైవ‌శం చేసుకుంది. దక్షిణాది నుండి ఎపిక్ పీరియాడికల్ డ్రామాలు యష్ నటించిన K.G.F: చాప్టర్ 2... S.S.రాజమౌళి RRR చిత్రాలు రెండు మూడు స్థానాల్ని అలంక‌రించాయి.

కమల్ హాసన్- విజయ్ సేతుపతి - ఫాహద్ ఫాసిల్ నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'తో అలియా భట్ 'గంగూబాయి కతియావాడి' నాల్గవ స్థానాన్ని పంచుకుంది.

అమితాబ్ బచ్చన్ నే'ఝుండ్'... అక్షయ్ కుమార్ 'సామ్రాట్ పృథ్వీరాజ్'.. అజయ్ దేవగన్ దర్శకత్వం వహించిన 'రన్ వే 34'.. యామీ గౌతమ్ - నేహా ధూపియా ప్రధాన పాత్రల్లో నటించిన డిస్నీ+ హాట్ స్టార్ చిత్రం 'ఏ థ‌ర్స్ డే'.. మలయాళం రొమాంటిక్ డ్రామా ప్రణవ్ మోహన్‌లాల్ న‌టించిన 'హృదయం' టాప్ 10లో చోటు ద‌క్కించుకున్నాయి.

ఆయా సినిమాల బాక్సాఫీస్ వ‌సూళ్లు.. ఇత‌ర‌ గణాంక నమూనాలు ..న విమర్శకుల నుండి వచ్చిన సమీక్ష‌లు..ర్యాంకింగ్ ల ఆధారంగా కాకుండా IMDB భారతదేశంలోని IMDB వినియోగదారుల పేజీ వీక్షణలపై IMDBPro డేటాను తీసుకుంటుంది.

వెబ్ సిరీస్ లలో 'క్యాంపస్ డైరీస్' తర్వాత తిగ్మాన్షు ధూలియా 'ది గ్రేట్ ఇండియన్ మర్డర్' టాప్ 1 టాప్ 2లో ఉన్నాయి. వికాస్ స్వరూప్ అత్యధికంగా అమ్ముడైన నవల 'సిక్స్ సస్పెక్ట్స్' ఆధారంగా రూపొందిన సిరీస్ ది గ్రేట్ ఇండియ‌న్ మ‌ర్డ‌ర్. భారతదేశ అంతరిక్ష మార్గదర్శకులు హోమీ జె. భాభా... విక్రమ్ సారాభాయ్ ల కథను తెలిపే 'రాకెట్ బాయ్స్' జాబితాలో 3వ స్థానంలో ఉంది. పంచాయత్-హ్యూమన్-యే కాళీ కాళీ అంఖీన్-అఫరాన్-ఎస్కేప్ లైవ్-మై-ది ఫేమ్ గేమ్ కూడా జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
Tags:    
  • SouthIndiaFilms 
  • PanIndiaFilms 
  • IMBDTopMovies 
  • RRRMovie 
  • KGFChapter2 
  • SSRajamouli 
  • TheKashmirFiles 
  • CampusDiariesWebSeries 
  • PrashanthNeel 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS