• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ కుర్రభామ పరిస్థితి...

ఈ కుర్రభామ పరిస్థితి ఏంటి.. డైలామాలో పడింది!

By - Tupaki Desk
Update: 2021-04-05 15:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్రభామల సందడి మాములుగా లేదు. ఎందుకంటే చాలామంది యంగ్ హీరోయిన్స్ తెలుగులో అడుగుపెడుతున్నారు. కానీ ఎవరు ఎంతకాలం నిలబడగలరో చెప్పలేం. అందం అభినయం ఉన్నాగాని అవకాశాలు రాబట్టుకోవాలి అంటే ఏదొక ప్రత్యేకత చాటుకోకతప్పదు. కొందరు హీరోయిన్స్ ఎప్పుడో సినిమాలు చేస్తారు కానీ ఫేమ్ ఆలస్యంగా వస్తుంది. కానీ కొందరి హీరోయిన్స్ మాత్రం ఒక్కసినిమా కూడా రిలీజ్ అవ్వకముందే సూపర్ క్రేజ్ తెచ్చుకుంటారు. అలాంటి ఫేమ్ అందరికి దక్కదు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసినిమా కూడా రిలీజ్ కాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది కేతికశర్మ. ఈ అమ్మడు క్రేజ్ అయితే తెచ్చుకుంది కానీ ఇంతవరకు ఒక్కసినిమా కూడా రిలీజ్ కాకపోవడం గమనార్హం.

ప్రస్తుతం ఈ కుర్రదాని చేతిలో మూడు సినిమాలున్నాయి. పేరుకే మూడు సినిమాలు కానీ ఇంతవరకు ఏ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ఎప్పుడో మొదలైన సినిమాలు కూడా ఎలాంటి ఊసు లేకుండా సైలెంట్ అయిపోయాయి. నిజానికి కేతిక.. ఆకాష్ పూరీ సరసన రొమాంటిక్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా గతంలోనే విడుదల కావాల్సింది కానీ ప్రస్తుతం ఆ సినిమా విడుదల డైలామాలో పడింది. ఆ సినిమాతో పాటు కేతిక.. నాగశౌర్య సరసన లక్ష్య సినిమా చేసింది. ఆ సినిమా నుండి కూడా రిలీజ్ గురించి ఎలాంటి స్పందనలేదు. వీటితో పాటు కేతిక ఇటీవలే మెగాహీరో వైష్ణవ్ తేజ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. దీనితో పాటు ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాలో కూడా కేతిక పేరు వినిపిస్తున్నట్లు టాక్. మరి చేతిలో ఇన్ని సినిమాలు ఉన్నప్పటికీ ఏ ఒక్కటీ రిలీజ్ లేక సంధిగ్ధంలో పడిందట. మరి జూనియర్ సమంత అయ్యే అవకాశం ఉందంటూ పొగిడినవారే ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. కానీ ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉందని మాత్రం టాక్ నడుస్తుంది. చూడాలి మరి త్వరలో ఏదైనా రిలీజ్ అవుతుందేమో!
Tags:    
  • ketika sharma 
  • ketika sharma Latest Images 
  • ketika sharma Photos 
  • Tollywood 
  • Telugu News 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS