కీర్తిది అనాలోచిత నిర్ణయం ఏమీ కాదు

Update: 2021-05-27 09:30 GMT
మహానటి చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్ గా కీర్తి సురేష్‌ గుర్తింపు దక్కించుకుంది. కమర్షియల్‌ హీరోయిన్ గా వరుస చిత్రాల్లో నటిస్తున్న సమయంలో మహానటి వంటి లేడీ ఓరియంటెడ్‌ చిత్రం ను కీర్తి ఎందుకు చేస్తుందంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు అదే తరహా విమర్శలు కూడా అన్నాత్తే సినిమా విషయంలో కీర్తి సురేష్‌ ఎదుర్కొంటుంది. సూపర్‌ స్టార్ రజినీకాంత్‌ నటిస్తున్న అన్నాత్తే సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెల్సిందే. మొదట రజినీకాంత్‌ కు జోడీగా కీర్తి సురేష్‌ నటిస్తుందనే వార్తలు వచ్చాయి. కాని తాజాగా రజినీకాంత్‌ కు సిస్టర్ గా కీర్తి సురేష్ కనిపించబోతున్నట్లుగా తమిళ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

స్టార్‌ హీరోయిన్‌ గా వరుసగా సినిమాలు చేసుకుంటూ కమర్షియల్‌ హీరోయిన్ గా దూసుకు పోతున్న ఏ హీరోయిన్ కూడా ఇలా చెల్లి పాత్రలను చేసేందుకు ఆసక్తి చూపించదు. కాని నటనకు ఆస్కారం ఉన్న పాత్రను చేసి నటిగా మంచి గుర్తింపును దక్కించుకోవాలనుకునే కీర్తి సురేష్ ఈ పాత్రను కమిట్ అయ్యిందట. కీర్తి సురేష్‌ తీసుకున్న నిర్ణయంను కొందరు అనాలోచితం అంటూ విమర్శలు చేస్తున్నారు. కాని ఆమె సన్నిహితులు మాత్రం అన్నాత్తే విడుదల అయిన తర్వాత ఆమెది అనాలోచిత నిర్ణయం కాదని వారే ఒప్పుకుంటారని నమ్మకంగా చెబుతున్నారు. అన్నాత్తేలో కీర్తి సురేష్‌ చాలా కీలక పాత్రలో కనిపించబోతుంది.. ఆమె నటనకు మంచి మార్కులు పడతాయని కూడా వారు చెబుతున్నారు.

కీర్తి సురేష్‌ ఇటీవలే తెలుగు ప్రేక్షకుల ముందుకు నితిన్‌ తో కలిసి రంగ్‌ దే సినిమా తో వచ్చింది. ఇక సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకు జోడీగా సర్కారు వారి పాట సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. తమిళంలో మరియు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్‌ అన్ని రకాల పాత్రలను చేస్తూ తనకంటూ ఒక మంచి బ్రాండ్‌ ను క్రియేట్‌ చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే రజినీకాంత్‌ కు సిస్టర్ గా కనిపించబోతుంది.
Tags:    

Similar News