కత్తికి ఎంతిచ్చారో.. రెచ్చిపోయింది

Update: 2016-04-09 15:30 GMT
కత్రినా కైఫ్‌ ఎలా ఉంటుందంటే.. కత్తి లాంటి ఫిగర్ అనే ఆన్సర్ నూటికి నూరు మంది నుంచి వచ్చే సమాధానం. కెరీర్ మొదట్లో డ్యాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డ ఈ భామ.. ఆ తర్వాత తన డ్యాన్స్ తోనే సినిమాని లీడ్ చేసేసే రేంజ్ కి చేరిపోయింది. ఐటెం సాంగ్స్ లోనూ సత్తా చాటేసి, బాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్స్ లిస్ట్ లో పేరు సంపాదించేసింది. అలాంటి కత్తిలాంటి కత్రినా కైఫ్.. ఇప్పుడు ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది.

నడుముకి బోలెడు కిందకు బాటమ్ కట్టుకొచ్చి.. అటు నడుము, ఇటు నాభి అందాలను ఓ రేంజ్ లో ఎగ్జిబిషన్ పెట్టేసింది. ఈ అమ్మడు చేసిన డ్యాన్స్ ఐపీఎల్ ప్రారంభోత్సవం మొత్తానికి హైలైట్ అనే టాక్ వచ్చిందంటే.. కేట్ కష్టం ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ ఇన్నేసి అందాలను ప్రదర్శించడానికి.. స్టేజ్ పై డ్యాన్స్ కట్టడానికి కత్రినా తీసుకున్న మొత్తం ఎంతో తెలుసా?

అక్షరాలా ఆరు కోట్ల రూపాయలు అందుకుని.. ఇంతేసి హుషారు చూపించింది కేట్. ఐపీఎల్ హంగామా కోసం ఆరు కోట్లు అంటే తక్కువేమో కానీ.. జస్ట్ పది నిమిషాల ప్రదర్శన కోసం.. అంత మొత్తం అందుకోవడమంటే చిన్న విషయం కాదు. అయితే.. ఆమె అభిమానులు కత్తి లాంటి మా కత్రినా పెర్ఫామెన్స్ కి ఎంతిచ్చినా తక్కువేలే అంటున్నారు.
Tags:    

Similar News