2020 మనందరికీ రోలర్-కోస్టర్ రైడ్ అంటున్న కె బ్యూటీ
మల్లీశ్వరిగా తెలుగు తెరకు పరిచయమైంది కత్రినా కైఫ్. వెంకీ బాలయ్య లాంటి స్టార్ల సరసన నటించింది. అయితే ఆ తర్వాత తెలుగు పై ఏమంత మక్కువ చూపించలేదు ఈ అమ్మడు. పూర్తిగా బాలీవుడ్ లో బిజీ అయిపోయి ఆ పరిశ్రమకే అంకితమైంది. ఏజ్ ఎంత ముదురుతున్నా ఈ అమ్మడి క్రేజు పెరుగుతోందే కానీ తగ్గలేదు. ఇక 2019 ఏమంత కలిసి రాకపోయినా 2020 తనకు ‘రోలర్-కోస్టర్ రైడ్’ అంటూ ఆనందంగా చెబుతోంది.
2020 అయ్యో రామా కరోనా! అని అంతా బాధ పడుతుంటే క్యాట్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించింది. ఈ సంవత్సరం తన జీవితాన్ని మెరుగుపరుచుకునే అవకాశంగా చూస్తానని చెప్పింది. కత్రిన కైఫ్ ఇటీవలి ప్రతికూలతల మధ్య కూడా ఈ సంవత్సరాన్ని ఎలా ఉపయోగించుకున్నారనే దాని గురించి ప్రశ్నిస్తే... ఇప్పటివరకు జరిగినదానిని ఆశావాద దృక్పథం కోణంలో చూడాలనుకుంటోందట.
అన్ని చెడు రోజులే కాదు.. మంచి రోజులు వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈ సమయంలో ఆత్మపరిశీలన కోసం చాలా సమయం దక్కింది. షూటింగులను తిరిగి ప్రారంభించిన తర్వాత కూడా లాక్ డౌన్ లో ప్రారంభించిన కొత్త దినచర్యను కొనసాగించాలని భావిస్తోంది.
కత్రినా కైఫ్ ఒక షో మిస్సయినంత మాత్రాన నిరాశ స్థితిలో లేదు. 2020 మనందరికీ రోలర్-కోస్టర్ రైడ్ అని అంటోంది. మనలో వేడిని మిశ్రమాన్ని మార్చే తరుణమిదే అని నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. కష్టాల కడలి నుంచి మనం చాలా బలంగా బయటకు వచ్చి జీవితంలోని చిన్న ఆనందాలకు విలువ ఇవ్వడం ప్రారంభించవచ్చని కత్రిన అంది. ప్రతి ప్రతికూలత ఒక గొప్ప అవకాశానికి దారి తీస్తుందని నమ్ముతున్నట్టు తెలిపింది. నా జీవితాన్ని మెరుగుపర్చడానికి ఈ సంవత్సరాన్ని ఒక గొప్ప సందర్భంగా చూశానని చెప్పారు. అన్నట్టు కే బ్రాండ్ సౌందర్య సాధనాల అమ్మకాలు జోరుగానే సాగుతున్నట్టున్నాయి. ఇప్పటికే ఈ బ్రాండ్ ని ప్రారంభించి ఏడాది పూర్తవ్వడంతో మాంచి జోష్ లో ఉన్న క్యాట్ రోలర్ కోస్టర్ రైడ్ అంటూ ఉబ్బితబ్బిబ్బవుతోందన్నమాట. కె బ్యూటీ కె కమ్యూనిటీ పేరుతో సౌందర్య ఉత్పత్తులు ఇప్పటికే మార్కెట్లో వైరల్ అయిన సంగతి తెలిసినదే. సినిమాల్లేకపోయినా బిజినెస్ లో బాగానే ఆర్జించేస్తోంది కత్రిన.
కెరీర్ సంగతి చూస్తే... రోహిత్ శెట్టి ‘సూర్యవంశీ’ లో అక్షయ్ కుమార్ సరసన నటిస్తోంది. ఈ చిత్రం మార్చి 24 న థియేటర్లలోకి రావాల్సి ఉండగా.. కరోనావైరస్ మహమ్మారి లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇది కాకుండా అలీ అబ్బాస్ జాఫర్ రాబోయే సూపర్ హీరో చిత్రానికి కూడా కత్రిన సిద్ధమవుతోంది.