రిసెప్షన్ లో కరీనా హంగామా చూశారా
సోనమ్ కపూర్ తన ప్రియుడు ఆనంద్‌ను అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. మూడేళ్ల వీరి ప్రేమప్రయాణానికి పెద్దల సమక్షంలో శుభంకార్డు పడింది. పెళ్లి వేడుక సంగతి పక్కన పెడితే రిసెప్షన్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. కొన్ని రోజుల పాటూ మీడియాలో వీరి రిసెప్షన్ గురించిన వార్తలే. ఎందుకంటే బాలీవుడ్ సూపర్ స్టార్లు టాప్ హీరోయిన్లు ఓ రేంజ్లో హంగామా చేశారు. ఇక కరీనా గురించి ఎంత చెప్పినా తక్కువే. తన కోస్టార్ కూడా అయిన సోమన్‌తో స్నేహం ఈ మధ్యన మరీ పెరిగిపోయింది కరీనాకు. అందుకే ఆమె పెళ్లిలో ఆనందంగా చిందులు వేసింది.
కరీనా తల్లి అయ్యాక చేసిన తొలి సినిమా వీరే ది వెడ్డింగ్. ఇందులో సోనమ్ కరీనా స్నేహితురాలిగా నటించింది. ఈ సినిమా అతి త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా షూటింగ్ సమయంలో మరింతగా దగ్గరయ్యారు సోనమ్-కరీనాలు. సోనమ్ రిసెప్షన్ కు భర్త సైఫ్ తో కలిసి హాజరైంది కరీనా. వెలుగు జిలుగుల చీరలో మెరిసిపోయింది. డీజే లో తమ భర్తకు ఇష్టమైన ఓలె ఓలె పాటను పెట్టమని కోరింది. ఆ పాట పెట్టాక ఒక చేత్తో డ్రింకు తాగుతూ స్టెప్పులేసింది. ఆమెతో పాటూ పలువురు హీరోయిన్లు కూడా చిందులేశారు. సోనమ్ రిసెప్షన్ లో సందడంతా ఆమెదే అనిపించింది చూసేవాళ్లకి. డీజే పూర్తయ్యాక కూడా కరీనా సెల్ఫీలతో డ్యాన్సులతో ఇరగదీసింది. అలియా భట్.. అక్క కరిష్మా కపూర్‌తో కలిసి ఫోటోలకు ఫోజిచ్చింది. సైఫ్ మాత్రం ఎక్కడా కాలు కదిపినట్టు కనిపించలేదు.
పెళ్లికి పెద్దగా బాలీవుడ్ ప్రముఖులు హాజరవ్వనప్పటికీ రిసెప్షన్ కు మాత్రం హాజరయ్యారు. అమీర్ ఖాన్ హృతిక్ రోషన్ జాడ మాత్రం కనిపించలేదు. అలాగే ప్రియాంక చోప్రా దీపికా పదుకునే కంగనా రనౌత్ వంటి హీరోయిన్లు కూడా కనిపించలేదు. ఇక సల్మాన్ ఖాన్ షారూఖ్ ఖాన్ డీజే వేదికపై కాసేపు ఆడిపాడారు. వారితో పాటూ సోనమ్ - ఆనంద్‌లు కూడా చిందులేశారు
వీడియో చూడటానికి క్లిక్ చేయండి
Full View