విజ‌యేంద్ర ప్ర‌సాద్ `సీత‌` ఎవ‌రో తెలుసా?

Update: 2021-03-22 08:30 GMT
వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాల‌తో ఇండ‌స్ట్రీ హీటెక్కుతోంది. ఓవైపు ఆర్.ఆర్.ఆర్ గురించి ఆస‌క్తిగా మాట్లాడుకుంటుండ‌గానే.. ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ నుంచి `సీత` ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఆర్.ఆర్.ఆర్ లో సీత పాత్రను ఆలియా కోసం ఆయ‌నే రాశారు. ఇప్పుడు ఈ కొత్త సీత ఎవ‌రు? అంటూ ప్ర‌శ్న త‌లెత్తింది.

ఎట్ట‌కేల‌కు విజ‌యేంద్ర ప్ర‌సాద్ `సీత` ఎవ‌రో తెలిసింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ సీత పాత్ర‌లో న‌టిస్తార‌న్న‌ది తాజా స‌మాచారం. క‌రీనా కొన్ని నెలల క్రితం పండంటి బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం త‌న బిడ్డ‌తోనే స‌మ‌యం గ‌డుపుతున్నారు. మ‌రోవైపు త‌దుప‌రి ప్రాజెక్టుల కోసం క‌రీనా  ఫిట్ నెస్ సెష‌న్స్ కి ఎటెండ‌వుతుండ‌డం షాకిస్తోంది.

కరీనా త‌దుప‌రి న‌టించే ప్రాజెక్టులలో సీత ఒక‌టి.  అలౌకిక్ దేశాయ్ దర్శకత్వం వ‌హిస్తారు. స్టార్ రైటర్.. ఫిల్మ్ మేకర్ విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల లో ముంబైలో ప్రారంభమవుతుంది. రామాయ‌ణంలో సీత గురించి తెలియ‌ని ఎన్నో విష‌యాల్ని ఈ సినిమాలో చూపిస్తార‌ట‌. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.
Tags:    

Similar News