రజనీ ఐకానిక్ మూవీ.. ఇలా అయ్యిందేంటి?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉండగా.. అందులో పడయప్ప (నరసింహ) ఒకటి.;
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉండగా.. అందులో పడయప్ప (నరసింహ) ఒకటి. 1999లో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఆ మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. ఆ సినిమాలోని డైలాగ్స్.. ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉండడం విశేషం.
ఆ సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్లు కంప్లీట్ అవ్వడంతోపాటు రజినీకాంత్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రీసెంట్ గా నరసింహ మూవీ రీ రిలీజైంది. అది కూడా రజనీ బర్త్ డే నాడు.. అంటే డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఇప్పుడు రీ రిలీజ్ లో అనుకున్న రేంజ్ లో అంచనాలు అందుకోలేదని చెప్పాలి.
ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా రీ రిలీజ్ లో నరసింహ మూవీ రూ.12 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయగా.. దళపతి విజయ్ గిల్లి రీ రిలీజ్ వసూళ్లను బీట్ చేస్తుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. సూపర్ ఐకానిక్ మూవీ.. ఆయన ల్యాండ్ మార్క్ బర్త్ డే నాడు వచ్చింది కనుక.. గిల్లి రికార్డు బ్రేక్ అవుతుందని చాలా మంది ఫిక్స్ అయిపోయారు.
మరికొన్ని కొత్త రికార్డులు కూడా క్రియేట్ చేస్తుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కనీసం విజయ్ గిల్లి రికార్డు కూడా బ్రేక్ చేయలేకపోవడం గమనార్హం. అయితే మేకర్స్ ప్రమోషన్స్ ను ఫుల్ గా నిర్వహించారు. సినిమాపై అందరి ఫోకస్ పడేలా చేశారు. ముఖ్యంగా నరసింహ మూవీకి సీక్వెల్ ఉంటుందని రజినీకాంత్ అనౌన్స్ చేశారు.
అలా ప్రమోషన్స్ తో నరసింహ రీ రిలీజ్ లో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. అయితే వసూళ్లు అనుకున్న రేంజ్ లో రాకపోవడానికి ముఖ్య కారణం తమళనాడులో మాత్రం సినిమాను రీ రిలీజ్ చేయడం. తెలుగులో కూడా విడుదల చేసి ఉంటే కచ్చితంగా భారీ వసూళ్లు వస్తాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
కానీ మేకర్స్ మాత్రం.. తమిళనాడుతోపాటు ఓవర్సీస్ కే పరిమితం చేశారు. దీంతో అదే సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పాలి. ఒకేసారి తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నరసింహ రీ రిలీజ్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అయితే ఇప్పటికైనా వసూళ్లు తక్కువ కాకపోయినా.. హోప్స్ ను అందుకోలేదు అంతే. మంచి కలెక్షన్స్ సాధిస్తోందని చెప్పాలి. మరి రీ రిలీజ్ ఫుల్ రన్ లో నరసింహ ఎంతటి వసూళ్లు రాబడుతుందో వేచి చూడాలి.