పవన్ మూవీ.. శ్రీలీలకు ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా?

దీంతో బ్లాక్ బస్టర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం నార్త్ టు సౌత్ పలు సినిమాల్లో యాక్ట్ చేస్తున్న శ్రీలీల.. ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు.;

Update: 2026-02-07 02:30 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

దానికి తోడు ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా సూపర్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అవుతుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో మూవీలో ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్న యంగ్ బ్యూటీ శ్రీలీల తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశిస్తున్నారు. ఎందుకంటే ఆమె కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే.

పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ లోకి వచ్చిన శ్రీలీల.. తక్కువ టైమ్ లోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారు. డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్ తో ఓ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ఆమె సొంతమైంది. స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు అందుకుని ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన అమ్మడు.. ఏకంగా స్టార్ హీరోయిన్ గా మారిపోయారు. భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీలీలకు రిజల్ట్స్ విషయంలో మాత్రం నిరాశ ఎదురైంది.

దీంతో బ్లాక్ బస్టర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం నార్త్ టు సౌత్ పలు సినిమాల్లో యాక్ట్ చేస్తున్న శ్రీలీల.. ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. మార్చి 26వ తేదీన రిలీజ్ కానున్న ఆ మూవీ.. తన కెరీర్ ను మలుపు తిప్పుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్‌ తో నటించిన పలువురు హీరోయిన్లకు కెరీర్‌ లో మంచి బ్రేక్ దక్కిన ఎగ్జాంపుల్స్ ను ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.

ముఖ్యంగా శ్రుతి హాసన్ వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడుతున్న సమయంలో గబ్బర్ సింగ్ మూవీలో పవన్ సరసన యాక్ట్ చేశారు. ఆ సినిమా బ్లాక్‌ బస్టర్ కావడంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌ గా ఎదిగిపోయారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ శ్రీలీల విషయంలో కూడా వర్కౌట్ అవుతుందా అన్న ఆసక్తి నెలకొంది.

అలా అనుకున్నట్లు జరిగితే.. అంచనాలకు తగ్గట్లు సినిమా సూపర్ హిట్ అయితే.. శ్రీలీల కెరీర్‌ కు కొత్త ఊపు రావడం ఖాయం. ఇప్పటివరకు వచ్చిన ఫ్లాపులన్నింటినీ మరిచిపోయేలా బ్లాక్‌ బస్టర్ దక్కితే అమ్మడు దూసుకుపోవడం పక్కా. మరిన్ని చిత్రాలతో బిజీగా మారనుంది. ఏదేమైనా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎలా ఉంటుందో.. ఎంతలా అలరిస్తుందో.. శ్రీలీలకు ఎంతటి హిట్ ఇస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News