విల‌న్ ని కూడా హీరోని చేసారు!

ఒక‌ప్పుడు తెలుగు సినిమాలో న‌టులంటే? ప‌ర‌భాష‌ల వారే ఎక్కువ‌గా క‌నిపించేవారు. వారికి ఇచ్చిన ప్రాధాన్య‌త లోక‌ల్ ట్యాలెంట్ కి ఇచ్చేవారు కాదు.;

Update: 2025-12-16 15:30 GMT

ఒక‌ప్పుడు తెలుగు సినిమాలో న‌టులంటే? ప‌ర‌భాష‌ల వారే ఎక్కువ‌గా క‌నిపించేవారు. వారికి ఇచ్చిన ప్రాధాన్య‌త లోక‌ల్ ట్యాలెంట్ కి ఇచ్చేవారు కాదు. ఇక్క‌డా పేరున్న న‌టులున్నా? పొరుగింట పుల్ల‌కుర్ర‌కే రుచెక్కువ? అన్న చందంగా భారీ పారితోషికాలు ఇచ్చి మ‌రీ తీసుకొచ్చేవారు. అలాగ‌ని ఇప్పటికీ వాళ్ల‌కి అవ‌కాశాలివ్వ‌క‌పోలేదు. నేటికి టాలీవుడ్ లో డామినేష‌న్ వాళ్ల‌దే. అయితే మునుప‌టి కంటే ప‌రిస్థితులు మారాయి. లోక‌ల్ ట్యాలెంట్ ని కూడా ఈ మ‌ధ్య‌కాలం లో ప్రోత్స‌హించ‌డం ఎక్కువైంది. కానీ స‌క్స‌స్ అవుతున్న వారు మాత్రం చాలా త‌క్కువే.

త‌మిళ్ లో స‌క్సెస్ అనంత‌రం:

విశాల్ తెలుగు న‌టుడే. తెలుగు ఎంతో చ‌క్క‌గా మాట్లాడుతాడు. కానీ విశాల్ కోలీవుడ్ లోనే సినిమాలు చేస్తుంటాడు. ఆరంభ రోజుల్లో అవ‌కాశాలు రాక‌పోవ‌డంతోనే కోలీవుడ్ లో స్థిర‌ప‌డ్డాడు. అంజ‌లి, ఆనంది లాంటి తెలుగు హీరోయిన్లు కూడా కోలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసిన వారు. అక్క‌డ స‌క్సెస్ అయిన త‌ర్వాత తెలుగులో వాళ్ల‌కీ అవ‌కాశాలు వచ్చాయి. అలాగే తెలుగు లో పుట్టి పెరిగిన బాబి సింహ కూడా త‌మిళ్ లో పెద్ద ఆర్టిస్ట్ . విల‌న్ గా చాలా సినిమాలు చేసాడు. అత‌డి కంటూ ప్ర‌త్యేక‌మైన ప్యాన్ బేస్ కూడా ఉంది. ఇత‌డి కెరీర్ కూడా కోలీవుడ్ లోనే మొద‌లైంది.

బాబి లాంటి ఇంకా ఉన్నారు:

ఇండ‌స్ట్రీ నుంచి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ కూడా లేదు. సినిమాలంటే ఆస‌క్తితో చెన్నైకి వెళ్లాడు. అక్క‌డ నుంచి త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్ట‌డం న‌టుడిగా అవ‌కాశాలు అందుకుని స‌క్సెస్ అవ్వ‌డం జ‌రిగింది. అక్క‌డ ప్రూవ్ చేసుకున్న త‌ర్వాతే తెలుగు సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చాయి. ఇక్క‌డ చేసింది కూడా చాలా త‌క్కువ సినిమాలే. తెలుగు లో ఎంట‌ర్ అవ్వ‌డం కంటే ముందే? మ‌ల‌యాళంలో కూడా కొన్ని సినిమాలు చేసాడు. ఇప్పుడు అదే బాబి సింహ‌ను టాలీవుడ్ హీరోగా లాంచ్ చేసింది. తాజాగా ఆ సినిమా నిన్న‌టి రోజున పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభమైంది.

లోక‌ల్ ట్యాలెంట్ ని ప్రోత్స‌హించాలి:

ఇప్ప‌టికైనా బాబి సింహ‌ను తెలుగు ప‌రిశ్ర‌మ గురించి హీరోగా లాంచ్ చేయ‌డం శుభ ప‌రిణామంగా చెప్పొచ్చు. ఇంకా ప‌రిశ్రమ గుర్తించాల్సిన న‌టులు చాలా మంది ఉన్నారు. అవ‌కాశాలు లేక ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌పై ఆధార‌ప‌డుతున్నారు. తెలుగు సినిమా పాన్ ఇండియాలో స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో స్థానిక న‌టుల‌కు మరిన్ని అవ‌కాశాలు క‌ల్పిస్తే ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం కూడా త‌గ్గుతుంది. హైద‌రాబాద్ ను సినిమా హ‌బ్ గా మారుస్తామ‌ని ప్ర‌భుత్వాలు స‌న్నాహాలు నేఏప‌థ్య‌లో అంత‌కంటే? ముందే లోక‌ల్ ట్యాలెంట్ ని గుర్తించి అవ‌కాశాలు క‌ల్పించాల‌ని ప‌రిశ్ర‌మ‌కు దిశానిర్దేశం చేయాలని ప‌లువురు కోరుతున్నారు.

Tags:    

Similar News