తెలంగాణ స్టార్ గోదారి యాసలోనా!
విజయ్ దేవరకొండ పక్కా తెలంగాణ వాసి. టాలీవుడ్ లో అతడి సక్సెస్ కి కూడా తెలంగాణ యాస కీలక పాత్ర పోషించింది.;
విజయ్ దేవరకొండ పక్కా తెలంగాణ వాసి. టాలీవుడ్ లో అతడి సక్సెస్ కి కూడా తెలంగాణ యాస కీలక పాత్ర పోషించింది. అంత వరకూ ఏ హీరో తెలంగాణ స్లాంగ్ లో తెరపై కనిపించలేదు. కొంత మంది ప్రయత్నం చేసినా అవి ఆంధ్రా వరకూ రీచ్ అవ్వలేదు. అలాంటి సమయంలోనే పెళ్లి చూపుల్లో పక్కా తెలంగాణ స్లాంగ్ మాట్లాడి ఆంధ్రాలో ఫేమస్ అయిపోయాడు విజయ్. ఆ సినిమా సక్సెస్ కి కాన్సెప్ట్ ఒక్కటే కారణంగా కాదు..పర్పెక్ట్ క్యాస్టింగ్ అన్నది అంతే కీలకంగా మారింది. విజయ్-ప్రియదర్శి కాంబినేషన్ లో సిసలైన తెలంగాణ మట్టి వాసన చూపించారు.
తెలంగాణ స్టార్లు వారిద్దరే:
ఆ తర్వాత నటించిన చాలా సినిమలకు విజయ్ స్లాంగ్ వర్కౌట్ అయింది. అప్పటి నుంచి తెలంగాణ స్టార్ అంటే? విజయ్ మాత్రమే గుర్తొస్తాడు. నితిన్ కూడా తెలంగాణ ప్రాంతం నుంచే స్టార్ అయినా? ఆంద్రా-తెలంగాణ అనే బేధం లేని సమయంలోనే స్టార్ అవ్వడంతో? ఆ ప్రభావం అతడిపై అంతగా లేదు. ఆ సంగతి పక్కన బెడితే తాజాగా విజయ్ దేవరకొండ ఇప్పుడు ఆంధ్రా స్లాంగ్ మాట్లాడబోతున్నాడా? స్వచ్ఛమైన గోదారి కుర్రాడిలా అలరిం చనున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. విజయ్ హీరోగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో `రౌడీజనార్దన్` అనే టైటిల్ తో ఓ సినిమా తెరెక్కుతోన్న సంగతి తెలిసిందే.
గోదావరి జిల్లాల రాజకీయమా?
టైటిల్ ని బట్టి ఇది యాక్షన్ స్టోరీ అని..రాయలసీమ నేపథ్య గల కథ అని ప్రచారం జరిగింది. విజయ్ రోల్ కూడా రౌడీ నేపథ్యంతోనే సాగుతుందని వార్తలొచ్చాయి. కానీ ఇదంతా ప్రచారం మాత్రమే. అసలు సంగతేంటి? అంటే ఇది పక్కా గోదావరి నేపథ్యంగల కథ. కోనసీమ ప్రాంతం నేపథ్యంలో సాగే ఓ పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఓ అందమైన ప్రేమకథ కూడా మిళితమై ఉంటుంది. కథ ఆరంభం నుంచి ముగింపు వరకూ గోదారి ప్రాంతాల్లోనే సాగుతుంది. ఎలాంటి రాయలసీమ బ్యాక్ డ్రాప్ కి సంబంధం లేదు.
గోదారి యాసలో విజయ్:
షూటింగ్ అంతా కూడా గోదారి ప్రాంతాలను తలపించేలా సెట్లు వేసి చిత్రీకరిస్తున్నారు. అయితే గోదారి కుర్రాడి పాత్రలో విజయ్ ఎలా పెర్పార్మ్ చేస్తున్నాడు? అన్నదే ఆసక్తికరం. ఏ నటుడైనా ఓ కొత్త యాసను మాట్లాడాలంటే సమయం పడుతుంది. ఆ మాండలికంపై పట్టు ఉంటే తప్ప సాధ్యం కాదు. `పుష్ప` సినిమా సమయంలో బన్నీ చిత్తూరు మాండలికం కోసం ప్రత్యేకంగా సన్నధం అయ్యాడు. ఆ ప్రాంతం నుంచి ఓ టీచర్ ని తీసుకొచ్చి భాషపై పట్టు సాధించాడు. మరి గోదారి యాసకు సంబంధించి విజయ్ ఎలాంటి హోం వర్క్ చేసాడో తెలియాలి.