టాలీవుడ్‌లో గ్రాండ్ మ్యాజిక్ లోడింగ్!
సోషియో ఫాంటసీ మూవీ `విశ్వంభర`ని యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్టతో చేస్తున్న ఆయన ఇప్పటికే దాన్ని పూర్తి చేసి మరో సినిమాని పట్టాలెక్కించిన విషయం తెలిసిందే.;
మెగాస్టార్ చిరంజీవి బిగ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. `వాల్తేరు వీరయ్య`తో రెండేళ్ల క్రితం సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్న చిరు మరో బిగ్ హిట్ కోసం గత రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా చిరు ఆచి తూచి అడుగులు వేస్తూ యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నాడు. సోషియో ఫాంటసీ మూవీ `విశ్వంభర`ని యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్టతో చేస్తున్న ఆయన ఇప్పటికే దాన్ని పూర్తి చేసి మరో సినిమాని పట్టాలెక్కించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చిరు `మన శంకర వరస్రసాద్ గారు`లో నటిస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా సాగే ఈ మూవీలో చిరుకు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రమోషన్స్‌ని కూడా టీమ్ ఇప్పటికే ప్రారంభించేసింది.
ఈ మూవీ రిలీజ్ సన్నాహాల్లో ఉండగానే చిరు తన 158వ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టేశారు. ఈ ప్రాజెక్ట్‌కు బాబి డైరెక్టర్. `వాల్తేరు వీరయ్య` తరువాత బాబి - చిరు కలిసి చేస్తున్న రెండవ ప్రాజెక్ట్ ఇది. ఇక వీటితో పాటు 159 ప్రాజెక్ట్ ని యంగ్ సెన్సేషన్ శ్రీకాంత్ ఓదెలతో చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. ప్రస్తుతం నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల `ద ప్యారడైజ్`ని తెరకెక్కిస్తున్నాడు. దీని తరువాతే చిరు ప్రాజెక్ట్ ఉండే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో గ్రాండ్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ కాబోతోందా?..మరో సారి వెండితెరపై సక్సెస్ ఫుల్ కాంబినేషన్ మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అదే మెగాస్టార్ చిరంజీవి, అశ్వనీదత్ కాంబినేషన్. వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో చిరంజీవి హ్యాట్రిక్ హిట్‌లని సొంతం చేసుకున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి, `చూడాలని ఉంది`, `ఇంద్ర` వీరి కలయికలో రూపొందినవే. మరోసారి వీరి సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది.
తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరుతో ప్రాజెక్ట్ గురించి నిర్మాత సి. అశ్వనీదత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచి కథే సక్సెస్‌కు కీ అని చెప్పిన దత్ ..మెగాస్టార్‌తో సినిమాపై స్పష్టతనిచ్చారు. చిరంజీవితో సినిమా పక్కా. కథ రెడీ అయిన వెంటనే సినిమా స్టార్ట్ చేస్తాం` అంటూ క్లారిటీ ఇచ్చారు. వైజయంతీ మూవీస్ 50 ఏళ్ల గోల్డెన్ జూబ్లీ సందర్భంగా స్పెషల్ ప్రాజెక్ట్స్‌ని పట్టాలెక్కించబోతోంది. ఇందులో భాగంగానే చిరు ప్రాజెక్ట్‌ని ప్రారంభించాలని అశ్వనీదత్ ప్లాన్ చేస్తున్నారట. వైజయంతి సంస్థ త్వరలో `కల్కి 2898ఏడీ `సీక్వెల్‌ని పట్టాలెక్కించనున్న విషయం తెలిసిందే.