పూల్ సైడ్ హ‌బ్బీతో బిప్స్ రొమాన్స్ పీక్స్

Update: 2021-10-20 07:19 GMT
టాలీవుడ్ లో ట‌క్క‌రి దొంగ సినిమాలో న‌టించింది బిపాసా బ‌సు. న‌ల్ల క‌లువ అంద‌చందాల‌కు స్టైలిష్ లుక్ కి తెలుగు యూత్ ఫిదా అయిపోయింది. కానీ ఆ త‌ర్వాత బిపాసా పూర్తిగా హిందీ ప‌రిశ్ర‌మ‌కే అంకిత‌మైంది. ఇక కెరీర్ జ‌ర్నీ సాగుతుండ‌గానే జాన్ అబ్ర‌హాంతో ఎనిమిదేళ్ల ప్రేమాయణం సాగించ‌డం.. అటుపై బ్రేక‌ప్ అవ్వ‌డం తెలిసిందే. ఆ త‌ర్వాత టీవీ న‌టుడు క‌రణ్ సింగ్ గ్రోవ‌ర్ ని బిపాసా పెళ్లాడింది. బిపాసా బ‌సు-క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్ జంట దాంప‌త్య జీవితం సంతోషంగా సాగిపోతోంది. ఇద్ద‌రు పెళ్లి చేసుకుని ఐదేళ్లు దిగ్విజ‌యంగా పూర్తిచేసారు. ఇద్ద‌రి ప్రేమ‌కు గుర్తుగా ఓ బేబి కూడా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట క‌లిసి సినిమాలు చేస్తున్నారు. సినిమా షూటింగ్ ల‌తో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ లైఫ్ ని కూడా ఎంత మాత్రం మిస్ అవ్వ‌లేదు. స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా యంగ్ ల‌వ్ బ‌ర్డ్స్ లా విదేశాలు చుట్టేస్తుంటారు. ఈ జంట ఫేవ‌రెట్ ప్లేస్ మాల్దీవులు. కాస్త విరామం దొరికినా మాల్దీవుల ట్రిప్ ని ఆస్వాధిస్తుంటారు. తాజా వెకేష‌న్ కి సంబంధించిన ఫోటోల‌ను ఇన్ స్టా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది ఈ జంట‌.

స్విమ్మింగ్ పూల్ లో జ‌ల‌కాలాడుతూ దిగిన సెల్ఫీలు ప్ర‌స్తుతం అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. ఈ జంట ఒక‌రినొక‌రు హ‌త్తుకుని రొమాంటిక్ గా ఉన్న ఫోటోలు ఇన్ స్టాలో వైర‌ల్ అవుతున్నాయి. టూపీస్ లో బిప్స్ అందాలు విందు చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. బిపాసా అభిమానులు ఈ ఫోటోల‌ పై హాట్ కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. పెళ్లిచేసుకుని ఓ బిడ్డ‌కు త‌ల్ల‌యినా బిప్స్ లో అందం ఇసుమొత్తు కూడా త‌రిగిపోలేద‌ని ఓ నెటిజ‌నుడు కామెంట్ చేసాడు. ఇక క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్ తో ప్రేమాయ‌ణం కంటే ముందు బిపాసా ప‌లువురు న‌టుల‌తో ఎఫైర్లు నెరిపిన సంగ‌తి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ కి చెందిన ఓ ప్ర‌ముఖ నిర్మాత కుమారుడి పేరు కూడా తెర‌పైకి వ‌చ్చి అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది.

ఇక క‌ర‌ణ్ సింగ్ ఇప్ప‌టికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ముందుగా శ్ర‌ద్ధా నిగ‌మ్ తో పెళ్లైంది. ఆమె తో విడాకుల త‌ర్వాత జెన్నిఫ‌ర్ విజ్నెట్ ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య కూడా మ‌న‌స్ప‌ర్ధ‌లు తలెత్త‌డంతో విడిపోయారు. ఇక మూడ‌వ పెళ్లిగా బిపాసాని 2016 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. `డేంజ‌ర‌స్` వెబ్ సిరీస్ లో ఈ భార్య‌భ‌ర్త‌లిద్ద‌రు క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే.


Tags:    

Similar News