నీ ముఖం మండా.. అంటూ తిట్టేసిన క‌ర‌ణ్‌!!

Update: 2021-06-29 09:30 GMT
బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత కరణ్ జోహార్ పూల‌రంగ‌డు స్టైల్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇండ‌స్ట్రీకి ఏ ట్రెండీ ఫ్యాష‌న్ వ‌చ్చినా ఆయ‌న అనుక‌రిస్తారు. ఫ్యాష‌న్ అండ్ స్టైలింగ్ లో ఆయ‌న శైలి యూనిక్ అన్న టాక్ ఉంది. తాజాగా క‌ర‌ణ్ త‌న‌దైన శైలి చమత్కారమైన రెడ్ స్వెట్ ష‌ర్ట్ ధ‌రించి ఫ‌న్ జ‌న‌రేట్ చేశాడు. ఇన్ స్టాలో ఈ లుక్ కి సంబంధించిన ఉబర్-కూల్ సెల్ఫీలను పంచుకున్నాడు. అయితే క‌ర‌ణ్ లుక్ కి ట్రోల్స్ తీవ్రంగా ఎదుర‌వుతున్నాయి.

ఇటీవ‌లే `దోస్తానా 2` నుంచి కార్తీక్ ఆర్య‌న్ ని తొల‌గించినందున అత‌డి అభిమానులు కూడా క‌ర‌ణ్ ని ట్రోల్ చేస్తున్నారు. సుశాంత్ సింగ్ విల‌న్ అంటూ క‌ర‌ణ్ కి ట్రోల్స్ ఎదుర‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

క‌ర‌ణ్ సెల్ఫీలోని ఆయన టీషర్ట్ పై `బురి నజర్ వాలే తేరా మూ కాలా` అని హిందీ క్యాప్షన్ ఉంది! సాధారణంగా టీ షర్ట్స్ పై ఇంగ్లీషు పదాలుండాలి కానీ క‌ర‌ణ్‌ హిందీలో సామెతను ఇంగ్లీషు పదాల్లో అచ్చేయించుకున్నాడు! ఆ హిందీ ప‌దాల‌కు అర్థం ``నన్ను చూసి ఏడ్చే నీ ముఖం మాడిపోను…`` అని అర్థం. త‌న‌ని ట్రోల్ చేసేవారికి క‌ర‌ణ్ కౌంట‌ర్ ఇద‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

క‌ర‌ణ్ ప్ర‌స్తుతం బాలీవుడ్ లో అర‌డ‌జ‌ను పైగా భారీ చిత్రాల్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆలియా భట్-రణబీర్ కపూర్ నటిస్తున్న‌ బ్రహ్మాస్త్ర కు ఆయ‌న స‌హ‌నిర్మాత‌. అక్షయ్ కుమార్-కత్రినా కైఫ్ సూర్య‌వంశీని నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ- అనన్య పాండే జంటగా పూరి ద‌ర్శ‌క‌త్వంలోని లైగ‌ర్ కి ఒక నిర్మాత‌గా కొన‌సాగుతున్నారు. దోస్తానా 2- త‌క్త్ వంటి చిత్రాల‌ను నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News