బాష్ కా బాప్ @ బాలీవుడ్!

Update: 2017-05-25 10:17 GMT
బాలీవుడ్ లో బోలెడన్ని పార్టీలు నడుస్తూనే ఉంటాయి. ప్రతీ రోజూ పదుల సంఖ్యలోనే సెలబ్రిటీ పార్టీలు రన్ అవుతూ ఉంటాయి. ఇక స్టార్స్ ఇచ్చే పార్టీలకు అయితే కొదువ ఉండదు. ప్రతీ సందర్భానికి ఓ పార్టీతో నానా హంగామా చేస్తుంటారు. ముఖ్యంగా బర్త్ డే పార్టీల విషయంలో స్టార్ హీరో హీరోయిన్లు.. డైరెక్టర్లు బీభత్సమైన పార్టీలు ఇస్తుంటారు.

ఇవాళ ఇలాంటి బర్త్ డే బాష్ లు అన్నిటినీ మించిపోయే అతి పెద్ద పార్టీ ఒకటి జరగనుంది. దీన్ని ఇస్తున్నది ఎవరో కాదు.. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్. ఇవాళ కరణ్ 45వ బర్త్ డే కావడంతోనే పార్టీ ఏర్పాటు చేస్తున్నాడు కానీ.. అతి పెద్ద పార్టీ ఇవ్వడానికి మరో కారణం కూడా ఉంది. అదే కరణ్ జోహార్ ఇద్దరు కవలలకు తండ్రి కావడం. సరోగసీ ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరిలో యష్.. రూహిలకు తండ్రయ్యాడు కరణ్ జోహార్. ఆ తర్వాత తన సమయంలో ఎక్కువ భాగం పిల్లల కోసమే కేటాయించగా.. ఓ నెల రోజులుగా అసలు బయటెక్కడా కనిపించ లేదు కూడా.

అంతగా పిల్లలతో మమేకమైపోయిన కరణ్ జోహార్.. ఆ పిల్లలు ఇంటికొచ్చిన తర్వాత తన తొలి పుట్టిన రోజు కావడంతో భారీ స్థాయిలో పార్టీ ఏర్పాటు చేసి.. బాలీవుడ్ కా బడా బాష్ ను తన ఇంటిలోనే నిర్వహించేస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News