బీ పార్టీలో ఎవరెవరు ఎవరెవరితో..
బాలీవుడ్ స్టార్స్ వీకెండ్ పార్టీలతో రచ్చ చేస్తుంటారన్నది తెలిసిందే. ఇక బాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఇచ్చే పార్టీలని చాలా ప్రత్యేకంగా చూస్తుంటారు. కారణం కరణ్ ఏ పార్టీ ఇచ్చినా బాలీవుడ్ మొత్తం అక్కడే పార్టీలో మునిగితేలుతూ రచ్చ చేస్తూ వుంటుంది. అలాంటి కరణ్ తన 50 వ పుట్టిన రోజు వేడుకలని ఈ బుధవారం ముంఐలో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పార్టీకి బాలీవుడ్ మొత్తం తరలి వచ్చింది. క్రేజీ స్టార్స్, జంటలు, డేటింగ్ లో వున్న వాళ్లు, త్వరలో పెళ్లికి రెడీ అవుతున్నా వాళ్లు.. రీసెంట్ గా పెళ్లైన వాళ్లంతా ఈ పార్టీలో మెరిసారు.
బుధవారం రాత్రి జరిగిన ఈ పార్టీకి రణ్ వీర్ సింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. కొత్తగా పెళ్లైన జంట విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్, మాధురీ దీక్షిత్, రాణీ ముఖర్జీ, షాహీద్ కపూర్, సల్మాన్ ఖాన్, అనుష్క శర్మ, సారా అలీఖాన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, రణ్ బీర్ కపూర్, అమీర్‌ఖాన్, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, చార్మీ, అనన్య పాండే తో పాటు చాలా మంది హీజరయ్యారు.
అమీర్ ఖాన్ మాత్రం తన మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి పార్టీకి హాజరయ్యాడు. అమీర్ సినిమాల్లో నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తూ వున్న కిరణ్ రావు తాజాగా కరణ్ పార్టీలో అమీర్ తో కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులివ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవలే విడాకులు తీసుకుని విడిపోయిన ఈ జంట ఇలా కరణ్ పార్టీలో కలిసి ఫొటోలకు పోజులివ్వడంతో అంతా అవాక్కవుతున్నారు. ఇక ఈ ఇద్దరి తరహాలోనే మరో హీరో హృతిక్ రోషన్ సడన్ షాకిచ్చాడు.
గత కొంత కాలంగా వైఫ్ సుహన్నే ఖాన్ కు విడాకులిచ్చి ఒంటరిగా వుంటున్న హృతిక్ రోషన్ త్వరలో సబా ఆజాద్ ని వివాహం చేసుకోబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కరన్ జోహార్ పార్టీకి రూమర్డ్ గాళ్ ఫ్రెండ్ సబా ఆజాద్ తో కలిసి రావడం పలువురిని షాక్ కు గురిచేసింది. పార్టీకి తనని తీసుకురావడమే కాకుండా హృతిక్ అందరికి సబా ఆజాద్ ని పరిచయం చేశాడట. ఇంత వరకు తమపై వస్తున్న రూమర్ లపై స్పందించని హృతిక్ ఏకంగా కరన్ పార్టీకి సబా ఆజాద్ ని తీసుకురాడవంతో వాటిని నిజం చేశాడని అంటున్నారు.
ఇక ప్రతీ ఈవెంట్ లో పాటు ముంబై వీధుల్లో జంటగా కనిపించే లవ్ బర్డ్స్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ మాత్రం ఈ పార్టీకి జంటగా రాకపోవడం విశేషం. మలైకా ఒంటరిగానే ఈ పార్టీలో సందడి చేసింది. వెరైటీ డ్రెస్ లో ఎంట్రీ ఇచ్చి అందిరికి షాకిచ్చింది. ఇక జాన్వీ కపూర్ కూడా ఈ పార్టీకి ఒంటరిగానే అటెంట్ కావడం గమనార్హం. ప్రతి పార్టీలోనూ ఎవరో ఒకిరితో ఎంట్రీ ఇచ్చే జాన్వీ కరణ్ పార్టీకి మాత్రం ఒంటరిగా రావడం చాలా మందికి షాకిచ్చిందట. తమన్నా కూడా ఒంటరిగానే ఈ పార్టీకి హాజరు కావడం విశేషం.