బిగ్ బాస్ హోస్ట్ మారాడు.. ఇది తాత్కాలికమా? శాశ్వతమా?
హిందీ బిగ్ బాస్ సీజన్ 16 మొదలై సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. గత సీజన్స్ కి మాదిరిగానే ఈ సీజన్ కూడా మంచి రేటింగ్ ను దక్కించుకుంటూ ఉంది. ఇక ఈ సీజన్ కి భారీ పారితోషికంను సల్మాన్ ఖాన్ తీసుకుంటున్నట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఈ వీకెండ్ ఎపిసోడ్ లో సల్మాన్ కాకుండా మరో స్టార్ కనిపించడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నేడు మరియు రేపటి ఎపిసోడ్ లో సల్మాన్ ఖాన్ కి బదులుగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కమ్ హోస్ట్ అయిన కరణ్ జోహార్ కనిపించబోతున్నాడు. ఈయన గతంలో ఓటీటీ బిగ్ బాస్ కి హోస్టింగ్ చేశాడు. ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు సల్మాన్ ప్లేస్ లో వచ్చాడు అంటూ అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ప్రేక్షకుల్లో పలు చర్చలు జరుగుతున్నాయి.
సల్మాన్ ఖాన్ గతంలోనే బిగ్ బాస్ కు దూరం అవ్వబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కనుక ఈ సీజన్ మధ్యలో ఆయన వెళ్లి పోయాడు అని.. సల్మాన్ ఖాన్ ను మళ్లీ బిగ్ బాస్ స్క్రీన్ పై చూడము కావచ్చు అనుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏంటీ అంటే బిగ్ బాస్ కు షార్ట్ బ్రేక్ మాత్రమే సల్మాన్ ఖాన్ తీసుకున్నాడట.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ కి డెంగ్యూ ఫీవర్ వచ్చిన కారణంగా ఈ వీకెండ్ ఎపిసోడ్ ను కరణ్ జోహార్ తో చేయిస్తున్నారు. వచ్చే వారానికి సల్మాన్ ఖాన్ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఆయన ఆరోగ్యం కుదుట పడకుంటే మరో వీకెండ్ ఎపిసోడ్స్ కి కూడా కరణ్ జోహార్ వస్తాడేమో తప్ప శాశ్వతం మాత్రం కాదని బిగ్ బాస్ నిర్వాహకులు అంటున్నారు.