'గని' సెట్స్ లో అడుగుపెట్టిన కన్నడ స్టార్ హీరో..!

Update: 2021-02-18 12:15 GMT
కన్నడ సీనియర్ స్టార్ హీరో ఉపేంద్ర చాలా గ్యాప్ తర్వాత తెలుగులో నటించనున్న సంగతి తెలిసిందే. మెగా హీరో వరుణ్ తేజ్ - సయీ మంజ్రేకర్ జంటగా నటిస్తున్న 'గని' సినిమాలో ఉపేంద్ర కీలక పాత్ర పోషించనున్నాడు. అయితే ఈరోజు హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో కన్నడ యాక్టర్ జాయిన్ అయినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో జరుగుతోంది. కొర్రపాటి కిరణ్‌ కుమార్ అనే డెబ్యూ డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

'కన్యాదానం' 'ఏ' 'ఉపేంద్ర' 'రా' 'రక్త కన్నీరు' 'ఒకేమాట' 'స్టుపిడ్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఉపేంద్ర.. చివరగా 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో స్పెషల్ పాత్రలో నటించాడు. ఆరేళ్ళ తర్వాత 'గని' సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో రెనసాన్స్‌ ఫిలింస్‌ - అల్లు బాబీ పిక్చర్స్ పతాకాలపై అల్లు బాబీ - సిద్ధు ముద్ద కలిసి నిర్మిస్తున్నారు. 'గని' చిత్రాన్ని జులై 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.




Tags:    

Similar News