మెగాస్టార్ కు కన్నడ పవర్ స్టార్ ఇన్విటేషన్

Update: 2019-05-13 04:34 GMT
మనకు ఇక్కడ మెగా ఫ్యామిలీ ఎలాగో  శాండల్ వుడ్ లో రాజ్ కుమార్ కుటుంబానికి ఆ తరహాలో అశేష ఆదరణ ఉంటుంది. రాజ్ కుమార్ గారు బ్రతికున్న కాలంలోనే చిరుతో ఎంతో సన్నిహిత్య సంబంధాలు నెరిపే వారు. ఆయన తర్వాత వారసులు ప్రస్తుత స్టార్ హీరోలు శివ రాజ్ కుమార్ పునీత్ రాజ్ కుమార్ ఆ బంధాన్ని అలాగే కొనసాగిస్తున్నారు.  నిన్న పునీత్ రాజ్ కుమార్ వ్యక్తిగతంగా చిరుతో పాటు రామ్ చరణ్ ను కలిసి వివాహ ఆహ్వాన పత్రికలు అందజేశారు.

పునీత్ అన్నయ్య రాఘవేంద్ర రాజ్ కుమార్ రెండో అబ్బాయి యువరాజ్ కుమార్ పెళ్లి జరగబోతున్న సందర్భంగా కార్డ్స్ ఇవ్వడానికి మరో అబ్బాయి వినయ్ కూడా వీళ్ళతో పాటు ఉన్నాడు. విడివిడిగా చరణ్ చిరులను కలుసుకున్న ఈ బృందానికి  సాదర స్వాగతం లభించింది. అంగరంగ వైభవంగా జరగబోయే ఈ పెళ్ళికి సౌత్ నుంచి అతిరధ మహారధులు రానున్నారు.

కన్నడ పవర్ స్టార్ గా పిలవబడే పునీత్ రాజ్ కుమార్ ఇలా మెగా ఫ్యామిలీని కలుసుకోవడం వాటి తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. చరణ్ మాల దీక్షలో ఉన్నాడని పిక్స్ లోని నల్ల దుస్తులను బట్టి అర్థమైపోయింది. బెంగుళూరులో జరగనున్న ఈ వేడుకకు చిరు చరణ్ లు ఇద్దరూ కలిసి వెళ్తారా లేక ఒకరే అటెండ్ అవుతారా ఇంకా తెలియాల్సి ఉంది. సైరా షూటింగ్ కోసం హైదరాబాద్ లోనే ఉన్న చిరుని కలిసాక మరికొందరు ముఖ్యమైన టాలీవుడ్ సెలెబ్రిటీలకు పునీత్ స్వయంగా వెళ్లి కార్డులు అందజేశాడు

Tags:    

Similar News