ఆరే మెట్రో కార్ షెడ్ కొట్టేశారని కంగన లబోదిబో
కంగన వర్సెస్ శివసేన.. కంగన వర్సెస్ బీఎంసీ ఎపిసోడ్స్ తెలిసినవే. ముంబై రద్దీ ప్రదేశంలోని కంగన ఇల్లు కార్యాలయాన్ని బీఎంసీ కుప్పకూల్చే ప్రయత్నం చేయడంతో దానిపై కోర్టుల పరిధిలో పోరాడుతోంది క్వీన్. తన వీధిలో ఇతరుల ఇండ్లు షెడ్లు కూల్చేయవద్దంటూ కంగన ఇదివరకూ బీఎంసీపై విరుచుకుపడింది. తనపై కోపంతో ఇతరుల కొంపలు కూల్చొద్దని అంది.
తాజాగా ఆరే మెట్రో కార్ షెడ్ ను బీఎంసీ కొట్టేయడం (స్క్రాప్ చేయడం)పై కంగనా రనౌత్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఆరే మెట్రో కార్ షెడ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత.. కంగనా రనౌత్ మాట్లాడుతూ.. ధనవంతులు శక్తివంతుల అజెండాకు అనుగుణంగా ‘పట్టణీకరణను ఆపడం’ సరైన పరిష్కారం కానే కాదని అన్నారు. ఆరే మిల్క్ కాలనీలో చెట్లను నరికివేయడంపై పౌర సంఘాలు .. పర్యావరణవేత్తల విస్తృత నిరసనల మధ్య ఈ ప్రాజెక్టును ఇప్పుడు కంజుర్మార్గ్ కు మార్చారు.
``కొంతమంది ఫాన్సీ కార్యకర్తల మొదటి ప్రపంచ సమస్యలు # ముంబైకర్స్ సమస్యలు కాదు`` అంటూ శివసేనపై పంచ్ లు వేసిన క్వీన్ ఇంకా చాలా విషయాలపై తులనాత్మక విమర్శ చేశారు. గత సంవత్సరం నేను ఒకటి కంటే ఎక్కువ అంటే లక్ష మొక్కలు నాటాను. చెట్లను నరికివేయడం మంచిది కాదు కానీ.. శక్తివంతమైన ధనవంతుల ఎజెండాకు అనుగుణంగా పట్టణీకరణను ఆపడం సరైన పరిష్కారం కాదు కానీ... సమస్య లో భాగం # ఆరే # మెట్రో ”అని కంగన ట్వీట్ చేసారు.
800 ఎకరాల ఆరే మిల్క్ కాలనీని రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించిన ఉద్ధవ్ థాక్రే.. మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టును మార్చనున్నట్లు ఆదివారం నాడు ప్రకటించారు. ``ముంబైలో సహజ అటవీ ప్రాంతం ఉంది. అరణ్యాలను నగరాలుగా మార్చారని మాకు తెలుసు. కానీ ఇక్కడ నగరం అడవిగా మార్చబడుతుంది. మన వద్ద ఉన్నదాన్ని మనం కాపాడుకోవాలి. మిగిలిన ప్రాంతంలో అభివృద్ధిని చేపట్టాలి” అని ఆయన అన్నారు. పునరావాసం కారణంగా ప్రభుత్వం అదనపు ఖర్చులు భరించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
గత నెలలో కంగనా ఉద్ధవ్ ను విమర్శించింది. బాలీవుడ్ మాఫియాతో చేయి కలిపిన నాయకుడు అంటూ ఫిరంగులు విసిరింది క్వీన్. నిర్మాణ ఉల్లంఘనల ఆరోపణలతో బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ముంబైలోని తన కార్యాలయాన్ని పాక్షికంగా కూల్చివేసినప్పుడు తనను శివసేన ఉద్ధవ్ లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించింది. ఉధవ్ ఠాక్రే - కరణ్ జోహార్ గ్యాంగ్ నా పని స్థలాన్ని విచ్ఛిన్నం చేసారు. ఇప్పుడు నా ఇంటిని నాశనం చేసి... నా ముఖం శరీరాన్ని ధ్వంశం చేయండి. మీరు ఏం చేస్తున్నారో ప్రపంచం స్పష్టంగా చూడాలని నేను కోరుకుంటున్నాను అని ఓ ట్వీట్ లో బుల్లెట్లు పేల్చింది క్వీన్.