• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇలా అయితే కష్టమే కమల్!

ఇలా అయితే కష్టమే కమల్!

By - Tupaki Desk
Update: 2018-07-24 08:57 GMT
మొన్న విడుదల చేసిన పోస్టర్ ప్రకారమైతే  విశ్వరూపం 2 విడుదలకు కేవలం 17 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. కానీ దాని తాలూకు సందడి ఎక్కడా కనిపించడం లేదు సరికదా అభిమానులకు తప్ప రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిన విషయం సాధారణ ప్రేక్షకులకు ఇంకా తెలియదు. ఆగస్ట్ 10 తమిళ్ తో పాటు తెలుగులో ఏకకాలంలో విడుదల చేస్తున్నట్టు సైలెంట్ గా అనౌన్స్ చేసిన కమల్ పబ్లిసిటీ విషయంలో చూపిస్తున్న నిర్లక్ష్యం ఓపెనింగ్స్ పై ప్రభావం చూపడం ఖాయం. నిజానికి విశ్వరూపం ఫస్ట్ పార్ట్ వచ్చి చాలా కాలమైన నేపధ్యంలో అందరు దాన్ని దాదాపుగా మర్చిపోయారు. పైగా భారతీయుడు లాగా హిస్టరీ క్రియేట్ చేసి ఇంపాక్ట్ చూపించిన సినిమా కాదు. టిపికల్ సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేసిన విధానానికి మంచి పేరుతో పాటు ఓ మాదిరి వసూళ్లు కూడా దక్కాయి . కానీ ఇప్పుడు రెండో భాగానికి గ్యాప్ వచ్చిన నేపధ్యం బజ్ లేకపోవడానికి కారణం అవుతోంది. ట్రైలర్ అచ్చం ఫస్ట్ పార్ట్ లాగే ఉందనే  ఫీలింగ్ కలిగించడం కూడా ఒకరకంగా హైప్ ని దెబ్బ తీస్తోంది. ఇన్ని ప్రతికూలతల మధ్య విశ్వరూపం 2కి అంచనాలు పెంచే పనిని ఇప్పటిదాకా తలకెత్తుకోకపోవడం వింతే.

ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే విశ్వరూపం విడుదలైనప్పుడు జరిగిన హంగామా మామూలుది కాదు. ఒకపక్క తమిళనాడులో బ్యాన్ మరోపక్క టెర్రరిజం మీద షాకింగ్ గా అనిపించే ఎన్నో వివాదాస్పద అంశాలు ఇందులో ఉన్నాయనే పబ్లిసిటీ భారీ ఓపెనింగ్స్ కి దారి తీసింది. ఆంధ్ర బోర్డర్ లో ఉన్న తమిళ ఫాన్స్ తెలుగు వెర్షన్ చూడటం  కోసం దగ్గరలో ఉన్న ఇక్కడి  ఊళ్లకు రావడం జరిగింది. సినిమా క్లాసిక్ అని కాదు కానీ టేకింగ్ పరంగా మెప్పించడంతో ప్రేక్షకులు పాస్ మార్కులు వేశారు. కానీ ఇదంతా గతం. ఇప్పుడు అంత సీన్ కనిపించడం లేదు. అప్పట్లో  చేసిన సందడిలో సగం కూడా ఇప్పుడు కనిపించడం లేదు. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీని జనం మర్చిపోయిన నేపధ్యంతో పాటు శ్రీనివాస కళ్యాణం లాంటి సినిమాల పోటీని ఫేస్ చేయాల్సి ఉంది. కమల్ ఇప్పుడున్న అతి తక్కువ టైంలో  మాటకు కట్టుబడి విడుదల చేస్తాడా లేక అలోచించి వాయిదా వేస్తాడా ఓ రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది. తెలుగు వెర్షన్ బిజినెస్ అసలు జరగనేలేదని ఇన్ సైడ్ టాక్.
Tags:    
  • Kamal Haasan 
  • Vishwaroopam 2 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS