• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  15 కోట్ల ఆడియో వేడుక.....

15 కోట్ల ఆడియో వేడుక.. చీఫ్ గెస్ట్ ఎవరు?

By - Tupaki Desk
Update: 2017-10-24 10:48 GMT
భారతీయ సినీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని స్థాయిలో ‘2.0’ ఆడియో వేడుకను చేయడానికి రంగం సిద్ధం చేసింది చిత్ర బృందం. ఏకంగా రూ.15 కోట్ల ఖర్చుతో దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ సెంటర్లో ఈ ఆడియో వేడుకను చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ఈ వేడుకలో లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతుండటం విశేషం. ఐతే ఇంత భారీ స్థాయిలో చేయబోయే ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిథి ఎవరు అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రశ్నకు జవాబు దొరికింది. లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ ‘2.0’ ఆడియో వేడుకకు చీఫ్ గెస్టుగా హాజరవుతున్నారట. చిత్ర బృందంతో పాటు ప్రత్యేక విమానంలో ఆయన దుబాయి వెళ్లబోతున్నారట. ఈ నెల 27న సాయంత్రం ‘2.0’ ఆడియో వేడుక జరుగుతుంది.

‘భారతీయుడు’ తర్వాత కమల్ హాసన్.. శంకర్‌ తో మరోసారి జత కట్టబోతున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ భారతీయుడు సీక్వెల్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే శంకర్ అడగ్గానే కమల్ ఈ ఆడియో వేడుకకు రావడానికి అంగీకరించారట. దీంతో తమిళ సినీ పరిశ్రమకు రెండు కళ్లు అనదగ్గర రజినీ.. కమల్ లను ఈ భారీ ఆడియో వేడుకలో చూసే అవకాశం అభిమానులకు దక్కబోతోంది. ఆడియో వేడుక తర్వాత వచ్చే నెలలో హైదరాబాద్ వేదికగా ‘2.0’ టీజర్ లాంచ్ చేయబోతుండట విశేషం. డిసెంబర్లో చెన్నైలో ట్రైలర్ లాంచ్ ఉంటుంది. 2018 జనవరి 25న ‘2.0’ ప్రేక్షకుల ముందుకొస్తుంది.
Tags:    
  • Kamal Haasan 
  • Rajinikanth 
  • Robo 2.0 Audio Launch 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS