• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'మా' అధ్యక్ష పదవికి పోటీ...

'మా' అధ్యక్ష పదవికి పోటీ చేయడం గురించి నందమూరి హీరో ఏమన్నాడంటే..!

By - Tupaki Desk
Update: 2021-06-24 16:30 GMT
తెలుగు చిత్ర పరిశ్రమలో ఈసారి మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు - జీవితా రాజశేఖర్ - హేమ పోటీ పడనున్నట్లు ప్రకటించారు. దీంతో 'మా' లో చతుర్ముఖ పోటీ నెలకొందని అందరూ అనుకుంటుండగా.. ఇప్పుడు నందమూరి కల్యాణ్‌ రామ్‌ పేరు తెరపైకి వచ్చింది. 

సెప్టెంబర్‌ లో జరగనున్న 'మా' అధ్యక్ష ఎన్నికల్లో హీరో కళ్యాణ్ రామ్‌ కూడా పోటీ చేయనున్నట్లు ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కల్యాణ్‌ రామ్ టీమ్‌ స్పందిస్తూ రూమర్స్ కు చెక్ పెట్టింది. నందమూరి హీరో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ఎలక్షన్స్ లో పోటీ చేయడం లేదని.. అవన్నీ ఊహాగానాలే అని అధికారికంగా ప్రకటించారు. మరి ప్రస్తుతం అధ్యక్ష పదవి కోసం బరిలో దిగిన నలుగురిలో నందమూరి ఫ్యామిలీ మద్దతు ఎవరికి ఉంటుందో చూడాలి.

ఇక సినిమాల విషయానికొస్తే.. కల్యాణ్ రామ్ ప్రస్తుతం తన స్వీయ నిర్మాణంలో ''బింబిసార'' అనే చారిత్రక నేపథ్యమున్న సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నాడు. కొత్త దర్శకుడు వశిష్ఠ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టైటిల్‌ లుక్‌ - మోషన్‌ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. అలానే నందమూరి తారకరామారావు ఆర్ట్స్ సమర్పణలో ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి కళ్యాణ్ రామ్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Tags:    
  • Nandamuri Kalyanram 
  • MAA 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS