• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరో హిస్టోరికల్ స్టోరీతో...

మరో హిస్టోరికల్ స్టోరీతో కళ్యాణ్ రామ్..!

By - Tupaki Desk
Update: 2021-06-30 05:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో డెబ్యూ దర్శకులకు అవకాశాలు ఇచ్చే హీరోలలో నందమూరి కళ్యాణ్ రామ్ ముందే ఉంటారు. ఇప్పటివరకు ఆయన కెరీర్ లో చాలామంది దర్శకులను పరిచయం చేసాడు. ఆయనతో సినిమాలు చేసిన దర్శకులు టాప్ స్టేజ్ లో ఉన్నారు. కానీ కొంతకాలంగా కళ్యాణ్ రామ్ హీరోగా ఇంకా తడబడుతూనే ఉన్నాడు. ఎందుకంటే వరుసగా ప్లాప్స్ పడేసరికి ప్రస్తుతం కళ్యాణ్ ఫామ్ కోల్పోయాడని టాక్ వినిపిస్తుంది. కానీ ఈ నందమూరి హీరో మాత్రం యువదర్శకులకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. ఆల్రెడీ లైన్ లో ఉన్న సినిమాలన్ని డెబ్యూ డైరెక్టర్స్ తోనే చేస్తున్నాడు.

కొంతకాలంగా కళ్యాణ్ కొత్త దర్శకుల కథలు స్క్రిప్టులు వింటూనే ఉన్నాడు. కానీ ఈసారి తదుపరి మూవీస్ విషయంలో చాలా జాగ్రత్తలు పడుతున్నట్లు అర్ధమవుతుంది. అలాగే ఎల్లప్పుడూ కొత్త ప్రయోగాలు చేసే హీరో కాబట్టి ఈసారి హిస్టోరికల్.. పీరియడిక్ స్టోరీస్ కూడా ఎంపిక చేసుకుంటున్నాడు. ఇటీవలే రాజేంద్ర అనే డెబ్యూ డైరెక్టర్ స్టోరీని ఓకే చేసాడు కళ్యాణ్ రామ్. రాజేంద్ర స్క్రిప్ట్, నారేషన్ నచ్చడంతో ఒకే సిట్టింగ్ లో ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో కళ్యాణ్ మూడు పాత్రలలో కనిపిస్తాడని ఇండస్ట్రీ టాక్. ఇదివరకు ద్విపాత్రభినయం చేసాడు కానీ త్రిపాత్రభినయం చేయడం ఇదే ఫస్ట్ టైమ్ కాబోతుంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.

ఈ ఏడాది సెకండ్ హాఫ్ లోపల కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇదిలా ఉండగానే ఇటీవల మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో బింబిసార సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఫస్ట్ టైమ్ పీరియడిక్ స్టోరీతో రాబోతున్నాడు. ఆల్రెడీ ఫస్ట్ లుక్.. మోషన్ పోస్టర్ కూడా ఆకట్టుకున్నాయి. తాజాగా మరో పీరియడిక్ స్టోరీకి ఓకే చెప్పినట్లు సమాచారం. నూతన దర్శకుడు నవీన్ దర్శకత్వంలో ఓ హిస్టోరికల్ స్క్రిప్ట్ ఓకే చేసాడట కళ్యాణ్. ఎలాగో ఈ మధ్యకాలంలో హిస్టోరికల్ స్టోరీస్ బాగా ఆదరిస్తున్నారు జనాలు. సో ఈ ధైర్యంతోనే కళ్యాణ్ రామ్ కూడా ఈ జానర్ స్టోరీస్ ఓకే చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అభిషేక్ నామా నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనుందట. అయితే ఈ చిత్రం 1950 టైంలో బ్రిటిష్ గూఢచారి నేపథ్యం చుట్టూ తిరగనుందని సమాచారం. త్వరలోనే సినిమా పూర్తి డీటెయిల్స్ బయటకి రానున్నట్లు తెలుస్తుంది. మరి కళ్యాణ్ రామ్ అప్ కమింగ్ దర్శకులకు టార్చ్ బారియర్ లా కనిపిస్తున్నాడని నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Tags:    
  • Kalyan Ram 
  • historical story 
  • Tollywood 
  • Telugu News 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS