• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్టీఆర్ 30వ సినిమాపై...

ఎన్టీఆర్ 30వ సినిమాపై క్లారిటీ ఇచ్చిన కల్యాణ్ రామ్!

By - Tupaki Desk
Update: 2022-07-27 16:30 GMT
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన 'ఆర్ ఆర్ ఆర్' సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమా పూర్తయ్యేవరకూ ఎన్టీఆర్ మరో ప్రాజెక్టు చేయలేదు. అందువలన 'ఆర్ ఆర్ ఆర్' తరువాత కొరటాలతో ప్రాజెక్టు చాలా ఫాస్టుగా పట్టాలపైకి వెళుతుందని అంతా భావించారు .. కానీ అలా జరగలేదు.

కొరటాల 'ఆచార్య' సినిమాకి సంబంధించిన సమస్యల్లో ఉండటం వలన, ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లడానికి మరింత ఆలస్యమవుతోంది. ప్రస్తుతానికి కొరటాలతో ఈ ప్రాజెక్టు ఉండకపోవచ్చనే టాక్  కూడా వినిపిస్తోంది.

ఎన్టీఆర్  - కొరటాల సినిమాకి కల్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాత. అందువలన తన తాజా చిత్రమైన 'బింబిసార' సినిమా ప్రమోషన్స్ లో ఆయన ఎన్టీఆర్ 30వ సినిమాకి సంబంధించిన విషయాన్ని ప్రస్తావించాడు. "రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ ఆర్ ఆర్' ఏ స్థాయి విజయాన్ని సాధించిందనేది అందరికీ తెలిసిందే. ఆ తరువాత సినిమా విషయంలోను  ఆడియన్స్ కి ఆ స్థాయి అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకి ఎంతమాత్రం తగ్గని సినిమానే ఎన్టీఆర్ చేయవలసి ఉంటుంది. అందుకు సంబంధించిన కసరత్తే జరుగుతోంది.

ఎన్టీఆర్ 30వ సినిమాకి సంబంధించిన అప్ డేట్ రావడం లేదని చాలామంది అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అభిమానులకి ఆ మాత్రం ఆత్రుత ఉండటం సహజం. తారక్ మాత్రమే కాదు ఆయన తరువాత సినిమాను చేసే దర్శకుడిపై కూడా ఆ మాత్రం ఒత్తిడి ఉంటుంది. అందువలన మరింత జాగ్రత్తగా అడుగులు వేయడం జరుగుతుంది.

ఒక ఎనౌన్స్ మెంట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసుకుని చేయాలి. అది అభిమానులకు ఆనందాన్ని కలిగించేది .. వాళ్లు ఆమోదించేది అయ్యుండాలి. అందుకోసమే వెయిట్ చేయడం జరుగుతోంది.

'బింబిసార' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తారక్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. ఆయనను చూడటానికీ .. ఆయన మాటలు వినడానికి అభిమానులు ఆసక్తితో ఉన్నారు. ఆ రోజున ఫోకస్ అంతా కూడా తారక్ పైనే ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చాడు. 'బింబిసార' సినిమాతో పాటు తన తదుపరి  సినిమాను గురించి ఎన్టీఆర్ ఏం చెబుతాడనే విషయం పట్ల అభిమానులు ఆసక్తితో ఉన్నారు. మరి ఆ స్టేజ్ పై ఎన్టీఆర్ ఏయే అంశాలను టచ్ చేస్తాడో చూడాలి.  
Tags:    
  • KalyanRam 
  • Bambisara 
  • Movies 
  • ChaitanyaBhardwaj 
  • CathereenaTerrsa 
  • NTR30 
  • TollywoodIndustry 
  • MovieNews 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS