• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నందమూరి హీరోకి...

నందమూరి హీరోకి మిస్టీరియస్ టైటిల్

By - Tupaki Desk
Update: 2018-12-03 05:39 GMT
సక్సెస్ తో సంబంధం లేకుండా హీరోగా తనకంటూ ప్రత్యేకమైన శైలిని అలవర్చుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా పేరు 118గా ఫిక్స్ చేసారు. ఆ మేరకు ఫస్ట్ లుక్ అని చెప్పలేం కానీ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసారు. చివరిలో మెలికలు తిరిగిన ఎనిమిది అంకెలో కళ్యాణ్ రామ్ స్టైలిష్ గా నిలుచున్న స్టిల్ ని సెట్ చేసిన తీరు వెరైటీగా ఉంది. ఈ నెంబర్ తో పేరెందుకు పెట్టారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

సుప్రసిద్ధ ఛాయాగ్రాహకులు కెవి గుహన్ దీని ద్వారా తెలుగులో డైరెక్టర్ గా డెబ్యూ చేస్తున్నారు. దర్శకుడిగా ఈయన మొదటి సినిమా 2010లో తమిళ్ వచ్చిన ఇనిదు ఇనిదు. ప్రకాష్ రాజ్ నిర్మించిన ఈ సినిమా మన హ్యాపీ డేస్ రీమేక్. ఆ తర్వాత గుహన్ మళ్ళి డైరెక్షన్ చేయలేదు. ఊహించని అంశాలతో 118 ఉంటుందని టైటిల్ ఇలా పెట్టడానికి చాలా ప్రత్యేక కారణం ఉందని నిర్మాత మహేష్ కోనేరు చెబుతున్నారు. 118లో నివేదా థామస్ షాలిని పాండే హీరోయిన్లు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది యూనిట్. పోస్టర్ లో జనవరి 2019 అని హింట్ ఇచ్చేసారు కాబట్టి మూడు లేదా నాలుగో వారం వచ్చే అవకాశాలు ఉన్నాయి.

శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ని ఈ నెలలో విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఈ ఏడాది ఎమ్మెల్యే కమర్షియల్ గా కొంత వర్క్ అవుట్ అయినా నా నువ్వే మాత్రం కళ్యాణ్ రామ్ ని బాగా నిరాశ పరిచింది. అందుకే ఈ 118 చాలా స్పెషల్ గా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. ఏ జానరో అర్థం కాకుండా పజిల్ లా ఇచ్చారు కాబట్టి టీజర్ వచ్చాక దీని గురించి క్లారిటీ రావొచ్చు
Tags:    
  • Kalyan Ram 
  • Kalyan Ram 118 Movie Title Logo 
  • 118 Movie Title Logo 
  • 118 Title Logo 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS