• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో: శర్వా ప్రేమ...

వీడియో: శర్వా ప్రేమ కల్లోలం

By - Tupaki Desk
Update: 2018-12-03 06:06 GMT
సుమారు ఏడాదిపైగా గ్యాప్ తో వస్తున్న శర్వానంద్ కొత్త సినిమా పడి పడి లేచే మనసు డిసెంబర్ 21 విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే ప్రమోషన్ వేగాన్ని పెంచిన టీం తాజాగా ఓ లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసింది. కల్లోలం అంటూ సాగే ఈ పాటను కృష్ణ కాంత్ రాయగా విశాల్ చంద్రశేఖర్ ట్యూన్ కంపోజ్ చేసాడు. అనురాగ్ కులకర్ణి గాత్రం మంచి ఫీల్ తో ఉంది. ఇక పాట విషయానికి వస్తే థీమ్ ని విజువల్స్ లో  చూపించే ప్రయత్నం ఇందులో చేసారు.

మెడికో స్టూడెంట్ అయిన సాయి పల్లవిని చూసిన శర్వా తనను ఎంత ఇష్టపడ్డాడో మాటల్లో వర్ణిస్తూ తన లాంటి దేవకన్య ట్రైన్ లో ప్రయాణించడం గురించి గమ్మత్తైన పదాలతో వర్ణించడం ఆకట్టుకుంటుంది. ట్రైన్ లో నుంచి అమాయక చూపులతో సాయి పల్లవి శర్వాను చూడటం బైక్ మీద స్టైలిష్ గా శర్వా తననే తలుచుకుంటూ ఊహల్లోకి వెళ్ళడం కాన్సెప్ట్ మొత్తం యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. మొత్తానికి ఆడియో అంచనాలు పెంచేలా ఉండటం విశేషం. ఇప్పటికే శర్వానంద్ సాయి పల్లవి ఫ్రెష్ కెమిస్ట్రీకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఇంతకు ముందే విడుదలైన టీజర్ తో పాటు మరో ఆడియో సింగల్ కూడా ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడీ  పాట కూడా వాటికి మించేలా అనిపించడం విశేషం.

విడుదలకు మూడు వారాల కంటే తక్కువ వ్యవధి ఉన్న నేపధ్యంలో త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ట్రైలర్ లాంచ్ కూడా చేయబోతున్నారు. అందాల రాక్షసి-కృష్ణగారి వీర ప్రేమ గాథ లాంటి టిపికల్ లవ్ స్టోరీస్ తో మెప్పించిన దర్శకుడు హను రాఘవపూడి దీన్ని కూడా అదే విధంగా తీర్చిదిద్దినట్టు సమాచారం. మహానుభావుడు తర్వాత శర్వానంద్ ఏంసిఏ తర్వాత సాయి పల్లవి చేస్తున్న మూవీ ఇదే కావడం విశేషం.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View

Tags:    
  • Sai Pallavi 
  • Sharwanand 
  • Padi Padi Leche Manasu Movie 
  • Telugu News 

Similar News

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS