టాప్‌ కొరియోగ్రాఫ‌ర్ తో కాజల్ రొమాన్స్‌.. పెళ్ల‌యినా డోన్ట్ కేర్‌!

Update: 2021-01-24 00:30 GMT
తెలుగు ఇండస్ట్రీలో కాజల్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చందమామ లాంటి ఈ బ్యూటీ నటిస్తే సినిమాకు అదనపు అందం గ్యారెంటీ. అలాంటి బ్యూటీ.. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. అయితే.. పెళ్లయినప్పటికీ.. తన కెరీర్ విషయంలో మాత్రం ఎలాంటి ఛేంజెస్ లేవని క్లారిటీ ఇచ్చేసిందీ బ్యూటీ.

గౌతమ్ కిచ్లు - కాజల్ దాదాపు ఏడేళ్ళకు పైగానే డేటింగ్ లో ఉన్నారు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తరువాతే దాంపత్య జీవితంలో అడుగు పెట్టారు. అయితే.. పెళ్లి తర్వాత కాజల్ ఇక సినిమాల్లో కొనసాగకపోవచ్చని అంతా అనుకున్నారు. కానీ.. అలాంటిదేమీ లేదని చెప్పేసింది కాజల్. త్వరలో ఓ సినిమాలో నటించనున్నట్టు ప్రకటించింది.

అదికూడా.. రొమాన్స్ రోల్ లో యాక్ట్ చేసేందుకు ఓకే చెప్పేసిందీ సుందరి. వివాహానంతరం ఇలాంటి క్యారెక్టర్లకి దూరంగా ఉంటుందని భావించినప్పటికీ.. 'నో వే' అంటూ పాత పద్ధతిలోనే ముందుకెళ్తోంది కాజల్. ఓ కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ తో రొమాన్స్ చేసేందుకు సిద్ధమైంది. ఆయనే ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా.

డీకే అనే తమిళ దర్శకుడు తెరకెక్కించనున్న ఒక రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ సినిమాలో ప్రభుదేవా హీరోగా నటించబోతున్నాడు. ఈ సినిమాలో కాజల్ గ్లామర్ రోల్ లో కనిపించనుందట. అంతేకాకుండా.. ప్రభుదేవాతో ఘాటు రొమాన్సే ఉంటుందని టాక్. మరి, ఆఫ్టర్ మ్యారేజ్ కాజల్ ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తుందో చూడాలి.

ఇదిలాఉండగా.. భర్తను కూడా సినిమాల్లోకి తీసుకొచ్చేందుకు ట్రై చేస్తోందట కాజల్. అంటే నటుడిగా కాదు.. సినిమా బిజినెస్ లోకి పట్టుకొస్తుందని టాక్. స్వతహాగా బిజినెస్ మెన్అయిన కిచ్లూ తో.. ప్రొడక్షన్ హౌజ్ ను స్థాపించాలని చూస్తున్నట్లు సమాచారం. మరి, ప్రొడక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి.
Tags:    

Similar News