తెలుగు ఇండస్ట్రీ లో రచయితల కొరత వల్లే కొత్త కథలు రావడం లేదా...
దర్శకుడు తన దర్శకత్వం పైనే పూర్తిగా ఫోకస్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడున్న యంగ్ ఫిలిం మేకర్స్ వాళ్లకు వాళ్లే కథలు రాసుకుంటున్నారు. కాబట్టి కొత్త కథలైతే రావడం లేదు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో వైవిధ్య భరితమైన కథలేమీ లేకుండా రొటీన్ గా సాగే కథలే వస్తున్నాయి. మేకింగ్ లో దర్శకులు కొంతవరకు వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. కాబట్టి సినిమాలు ఎలానో అలా గట్టెక్కుతున్నాయి. కానీ బలమైన రైటింగ్ అయితే ఎక్కడా కనిపించడం లేదు. నిజానికి ఒక బలమైన రైటింగ్ వల్లే సినిమా చూసే ప్రేక్షకుడి మైండ్ సెట్ మారుతుంది. కథ ఎలా ఉంది మాటలు ప్రేక్షకుడిని ఎంతలా ఇంప్రెస్ చేశాయి. స్క్రీన్ ప్లే లో కొత్తదనం వల్ల ప్రేక్షకుడు ఎలాంటి అనుభూతిని పొందాడనేది చాలా కీలకం. వీటివల్లనే సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఒక సినిమా కోసం చాలామంది రైటర్లు పనిచేసేవారు. కానీ ఇప్పుడు దర్శకుడే రచయితగా పనిచేయడం వల్ల సినిమాలోని కొత్తదనం లోపిస్తుంది. రచయిత దర్శకుడు ఒక్కరే అవ్వడం వల్ల రచయితను డామినేట్ చేస్తూ దర్శకుడు పూర్తి స్థాయిలో చెలరేగిపోతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే కథ మాటలు స్క్రీన్ ప్లే రచయితలను తీసుకుంటే బాగుంటుంది.
దర్శకుడు తన దర్శకత్వం పైనే పూర్తిగా ఫోకస్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడున్న యంగ్ ఫిలిం మేకర్స్ వాళ్లకు వాళ్లే కథలు రాసుకుంటున్నారు. కాబట్టి కొత్త కథలైతే రావడం లేదు. ఇక రచయితలు సైతం ఇండస్ట్రీలో ఎక్కువగా కొనసాగడం లేదు ఎందుకంటే వాళ్లకు సరైన గుర్తింపు రావడం లేదనే ఉద్దేశ్యంతో ప్రతి రచయిత దర్శకుడిగా మారుతున్నాడు. దానివల్ల ఇండస్ట్రీలో రైటర్ల కొరత ఏర్పడుతుంది. మరి దీనిని అధిగమించాల్సిన అవసరమైతే ఉంది. ప్రతి రచయితకు తగినంత గుర్తింపు, సరైన పారితోషికం ఇస్తే ఇప్పటికీ రచయితలుగా కొనసాగడానికి చాలామంది ముందుకు వస్తారు. కానీ అవేమీ వాళ్లకు రాకపోవడంతో వాళ్లు రాసుకున్న కథలకి సైతం వేరే వాళ్ల పేర్లు వేసుకోవడం చూసినవాళ్లు విసిగిపోయి దర్శకులుగా మారిపోతున్నారు.
ఇక కొంతమంది దర్శకులు వాళ్లకు వాళ్లే కథలను అందించుకుంటున్నప్పటికి గొప్ప కథలు రాయడంలో మాత్రం ఎప్పటికప్పుడు వాళ్ళు కొత్తదనాన్ని అనుసరించాల్సిన విధానాన్ని మర్చిపోయి రొటీన్ ఫార్ములా లోనే వెళ్తున్నారు... కొంతమంది దర్శకులు సపరేట్ గా డైరెక్షన్ మీదనే ఫోకస్ చేస్తున్నారు వాళ్ళకంటూ కొంతమంది రచయితలను పెట్టుకొని కథ మాటలు స్క్రీన్ ప్లేలను రాయించుకున్నారు. ఏది ఏమైనా కూడా వీటన్నింటిలో వైవిధ్యం లోపించినప్పుడు దర్శకుడు ఎంతవరకు సినిమాని స్క్రీన్ మీద గొప్పగా ప్రజెంట్ చేసినా కూడా ప్రేక్షకుడు దానిని తీసిపారేస్తూ ఉంటాడు. అందుకే కథ మాటలు స్క్రీన్ ప్లే విషయంలో క్లారిటీని మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే దర్శకులకు భారీ బ్లాక్ బస్టర్ సక్ససులైతే దక్కుతాయి...