నాగ్, బాలయ్య, ఎన్టీఆర్.. ఈసారి చిరు అంతకుమించి
వెండితెరపై రికార్డులు బద్దలు కొట్టిన స్టార్ హీరోలు ఓటీటీల్లో హోస్టులుగా మారడం టాలీవుడ్ కు కొత్తేమీ కాదు. నాగార్జున, ఎన్టీఆర్, నాని బుల్లితెరపై తమ మార్క్ చూపించారు.
వెండితెరపై రికార్డులు బద్దలు కొట్టిన స్టార్ హీరోలు ఓటీటీల్లో హోస్టులుగా మారడం టాలీవుడ్ కు కొత్తేమీ కాదు. నాగార్జున, ఎన్టీఆర్, నాని బుల్లితెరపై తమ మార్క్ చూపించారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి అన్‌స్టాపబుల్ తో క్రియేట్ చేసిన సెన్సేషన్ చూశాం. ఇదంతా లోకల్ ప్లాట్‌ఫామ్ మీద జరిగిన రచ్చ. అయితే మెగాస్టార్ చిరంజీవి వేస్తున్న అడుగు వీరందరికీ భిన్నంగా, అంతకుమించి అనే రేంజ్ లో ఉండబోతోందని ఇండస్ట్రీలో గట్టి టాక్ వినిపిస్తోంది.
మెగాస్టార్ ఇదివరకే ఎవరు మీలో కోటీశ్వరుడు అనే షో చేశారు. కానీ ఈసారి ఆ రూట్లో వెళ్లడం లేదని తెలుస్తోంది. ఇక చిరు ఎంట్రీ ఇవ్వబోయేది ఇంటర్నేషనల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లో. నెట్‌ఫ్లిక్స్ రేంజ్ ఎలాంటిదో, కంటెంట్ కోసం బడ్జెట్ విషయంలో వాళ్లు ఏ స్థాయిలో ఖర్చు పెడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే వాళ్లు ఒక రీజనల్ స్టార్ తో షో డిజైన్ చేస్తున్నారంటే, అది కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిమితమయ్యే రెగ్యులర్ చిట్ చాట్ లా ఉండదని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు.
ఇంటర్నేషనల్ ప్లాట్ ఫామ్ కాబట్టి వాళ్ల మేకింగ్ స్టాండర్డ్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ షో ఉంటుందని ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదొక రొటీన్ టాక్ షో ఫార్మాట్ లో కాకుండా భిన్నంగా ఉండనుందట. కేవలం సినిమా స్టార్స్ ను మాత్రమే కాకుండా వివిధ రకాల ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ వ్యక్తులను ఈ వేదికపైకి తీసుకురావాలనేది మేకర్స్ ఆలోచన. జాతీయ స్థాయి సెలబ్రిటీలతో చిరు చేసే ముచ్చట్లు కచ్చితంగా వీక్షకులకు ఒక సరికొత్త కిక్ ఇస్తాయని నెటిజన్లు ఆశిస్తున్నారు.
విస్తృత ఆడియన్స్ టార్గెట్ గా ఈ షోను మల్టీ లాంగ్వేజెస్ లోకి డబ్ చేసే అవకాశం లేకపోలేదు. ఆ రూట్లో వెళితే చిరంజీవి మేనియా మరో లెవెల్లో క్లిక్ కావచ్చు. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో పాటు మిగతా ప్రధాన భాషల్లో దీన్ని ప్రమోట్ చేస్తే, ఒక తెలుగు హీరో ఇంటర్నేషనల్ ఓటీటీలో సృష్టించే ఇంపాక్ట్ మామూలుగా ఉండదు.
ఈ మధ్య ఈవెంట్లలో చిరు టైమింగ్, కౌంటర్లు ఎంత నాచురల్ గా పేలుతున్నాయో చూస్తున్నాం. ఆ స్పాంటేనియస్ ఎనర్జీని నెట్‌ఫ్లిక్స్ వాడుకుంటే రీచ్ మామూలుగా ఉండదు. స్క్రిప్టెడ్ డైలాగ్స్ లేకుండా, ఎదుటి వ్యక్తితో పాత అనుభవాలను పంచుకుంటూ సాగే ప్రయాణం ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది. ఆ క్రేజ్ కు తగ్గట్టుగానే అత్యంత భారీ సెట్ ను డిజైన్ చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం సోషియో ఫాంటసీ విశ్వంభర పనులతో పాటు బాబీ డైరెక్షన్ లో కాకా షూటింగ్ లో చిరు బిజీగా ఉన్నారు. ఈ షో వ్యవహారం అధికారికంగా ఓకే అయితే ఆయన కెరీర్ లో మరో బిగ్ టర్న్ అవుతుంది. చూడాలి మరి ఎప్పుడూ క్లారిటీ ఇస్తారో.