వెడ్డింగ్ వైబ్స్‌లో కల్యాణి ప్రియదర్శన్ గ్లామర్ లుక్...ఆ మూవీ తో నెక్స్ట్ లెవెల్ హైప్!
టాలెంటెడ్ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ తాజాగా పంచుకున్న ట్రెడిషనల్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
టాలెంటెడ్ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ తాజాగా పంచుకున్న ట్రెడిషనల్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రముఖ నటి అహనా కృష్ణ వివాహ వేడుకకు హాజరైన కల్యాణి, ఎమరాల్డ్ గ్రీన్ పీకాక్- లోటస్ చీరలో అచ్చం రాజకుమారిలా మెరిసిపోయి అందరి దృష్టిని ఆకర్షించింది. సాంప్రదాయ బంధేజ్ ప్రింట్స్, గోల్డెన్ జరీ వర్క్‌తో ఉన్న ఈ రాయల్ లుక్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతూ ఫ్యాన్స్ మనసులను కొల్లగొడుతోంది.
పింక్ సిటీ శారీలో కల్యాణి రాయల్ లుక్ :
ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం కల్యాణి ప్రియదర్శన్ ప్రసిద్ధ డిజైనర్ లేబుల్ 'పింక్ సిటీ బై సరిక'కు చెందిన ఎమరాల్డ్ గ్రీన్ సిల్క్ చీరను ఎంచుకుంది. చీర శరీరంపై ట్రెడిషనల్ బంధేజ్-ఇన్‌స్పైర్డ్ ప్రింట్స్, భారీ బార్డర్‌పై నెమళ్లు, తామర పూల ఎంబ్రాయిడరీ వర్క్ ఆమెకు అద్భుతమైన గ్రేస్‌ను తెచ్చిపెట్టాయి. ఈ సింపుల్ అండ్ క్లాసీ లుక్ చూసిన అభిమానులు "కల్యాణి క్వీన్", "బ్యూటిఫుల్" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
సూపర్ హీరో చిత్రం నుంచి బాలీవుడ్ బాట వరకు:
మలయాళంలో 'లోకా చాప్టర్ 1: చంద్ర' చిత్రంతో భారతదేశపు మొట్టమొదటి హీరోయిన్స్ లో సూపర్‌హీరోగా నటించి రూ. 300 కోట్లకు పైగా వసూళ్లతో ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది కల్యాణి. ఇక ఈ చిత్రంతో పాన్-ఇండియా రేంజ్‌లో భారీ క్రేజ్ తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు త్వరలో రాబోయే 'లోకా చాప్టర్ 2' షూటింగ్‌కు కూడా సిద్ధమవుతోంది.
రణ్‌వీర్ సింగ్ 'ప్రళయ్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ:
ఫ్యాషన్ పరంగానే కాకుండా సినిమాల పరంగానూ కల్యాణి కెరీర్ ఊపందుకుంది. బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా జై మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్-బడ్జెట్ జాంబీ యాక్షన్ థ్రిల్లర్ 'ప్రళయ్' చిత్రంలో కల్యాణి కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ మూవీతో ఆమె బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టనుంది. రణ్‌వీర్ రగ్గడ్ లుక్, కల్యాణి గ్లామరస్ ప్రెజెన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.
భారీ హైప్‌తో దూసుకుపోతున్న కల్యాణి కెరీర్:
ఇప్పటికే సౌత్‌లో అద్భుతమైన విజయాలతో టాప్ హీరోయిన్ గా వున్నా కల్యాణి ప్రియదర్శన్, 'ప్రళయ్' సినిమాతో బాలీవుడ్‌లోనూ సంచలనాలు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రంతో ఆమెకు మరింత భారీ క్రేజ్ రావడం పక్కా అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక తన అందంతో సోషల్ మీడియాను ఊపేస్తూ, వరుస పాన్-ఇండియా ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న కల్యాణి ప్రియదర్శన్, రాబోయే రోజుల్లో వెండితెరపై మరిన్ని అద్భుతమైన విజయాలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.