హను రాఘవపూడి డైరెక్షన్ లో నాని ఆ సినిమా చేయాల్సిందా?
| దర్శకుడు హను రాఘవపూడి గతంలో నాని కోసం ఓ సిన్సియర్ ఆర్మీ ఆఫీసర్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. నాని కమిట్మెంట్స్ కారణంగా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ఆర్మీ నేపథ్యంతో ‘సీతారామం’ తెరకెక్కించారు. ప్రస్తుతం ప్రభాస్తో ‘ఫౌజీ’ చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తర్వాత నాని కోసం రాసిన కథను తెరకెక్కించే ఆలోచనలో హను ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
'అందాల రాక్షసి' సినిమాతో ప్రేమకథలను ఇలా కూడా చెప్పొచ్చా అనేలా విమర్శకుల ప్రశంశలను అందుకున్న దర్శకుడు గాను రాఘవపూడి. తన మేకింగ్ లో మణిరత్నం శైలి కనిపిస్తుంది. ఆయన ఇస్తాటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటాడు. నాని తో చేసిన 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' మూవీతో మేకింగ్ లో కొత్త ఒరవడిని సృష్టించాడు.
నాని కోసం రాసుకున్న ఆ పాత్ర ఏంటి?
'పడి పడి లేచే మనసు' సినిమా రిలీజ్ తర్వాత సిన్సియర్ ఆర్మీ ఆఫీసర్ పాత్ర తో ఒక కథను రాసుకొని నాని కి వినిపించాడట. కానీ నానికి ఉన్న కమిట్ మెంట్స్ వల్ల ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయాడు. దాంతో ఆర్మీ బేస్డ్ స్టోరీ ఇంకొకటి ప్లాన్ చేశాడు. అందులో ప్రేమ కథను మిళితం చేసి సాడ్ ఎండింగ్ ఇవ్వాలనుకున్నాడట. అదే దుల్కర్ సల్మాన్ తో సీతా రామం... ఇప్పటి వరకు ఆయన కేవలం ఆర్మీ బ్యాక్ డ్రాప్ ను బేస్ చేసుకొని మూడు కథలు రాసుకున్నారట. అందులో ఒకటి నాని తో చేయాల్సింది కాగా, మరొకటి 'సీతా రామం' ఇంకొకటి ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న 'ఫౌజీ' కావడం విశేషం...
వీటన్నింటిలో నాని కోసం రాసిన కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందట. ఆర్మీ లో ఇప్పటి వరకు ఎవ్వరు చూపించని ఒక కొత్త పాయింట్ తో రాసుకున్నాడట. ఫౌజీ రిలీజ్ అయ్యాక ఆ కథతోనే నానితో మూవీ చేసే ఆలోచనలో దర్శకుడు ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. హను రాఘవపూడి చేసే కథల్లో వైవిధ్యం ఉంటుంది. ముఖ్యంగా సీతారామం మూవీ లో క్లైమాక్స్ విషయంలో ఆయన సాహసం చేశాడనే చెప్పాలి. హీరోను ఎలాగోలా సేవ్ చేయాలనే ఉద్దేశ్యంతో కన్విన్సింగ్ సీన్స్ రాయలేదు. హీరోను పాకిస్తాన్ ఆర్మీ కి దొరికిపోయిన ఆఫీసర్ గా చూపించాడు. అలాంటి సన్నివేశాలను రాయాలంటే చాలా ధైర్యం ఉండాలి. కొంచెం తేడా కొట్టిన సినిమా ప్రేక్షకుడికి నచ్చదు. ఆ విషయంలో చాలా రిస్క్ చేశాడనే చెప్పాలి...
ఫౌజీ లో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గానే కనిపిస్తాడా?
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సైన్యంలో పనిచేసే ఆర్మీ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపిస్తాడట. సినిమా మొత్తం యుద్ధ వాతావరణంలోనే నడుస్తుందట. రీసెంట్ గా ప్రభాస్ బర్త్ డే రోజున రిలీజైన గ్లింప్స్ కి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. ఈ సినిమాకోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హను రాఘవపూడి మేకింగ్ స్టైల్ తెలిసిన ప్రతి ఒక్కరు ప్రభాస్ ను చాలా కొత్తగా చూపిస్తాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.