చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేదంటూ బ‌తిమాలారు

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ యంగ్ హీరోతో ప్రముఖ క‌మ‌ర్షియ‌ల్ దర్శకుడు స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించిన ఓ `డిజాస్టర్ మూవీ` గురించి తాజాగా మ‌హిళా ఫైనాన్షియ‌ర్ కం పంపిణీదారు ఆవేద‌న వెల్ల‌గ‌క్క‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Update: 2026-09-28 18:03 GMT

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ యంగ్ హీరోతో ప్రముఖ క‌మ‌ర్షియ‌ల్ దర్శకుడు స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించిన ఓ `డిజాస్టర్ మూవీ` గురించి తాజాగా మ‌హిళా ఫైనాన్షియ‌ర్ కం పంపిణీదారు ఆవేద‌న వెల్ల‌గ‌క్క‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. స‌జావుగా అప్పులు క్లియ‌ర్ చేసి, సినిమా రిలీజ్ కోసం తాను కోట్లాది రూపాయ‌ల డ‌బ్బు స‌ర్ధుబాటు చేసినా.. రిలీజ్ త‌ర్వాత ఫోన్లు తీయ‌కుండా, త‌న‌కు చేసిన‌ అన్యాయం గురించి మాట్లాడ‌టం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ సినిమా ప్రదర్శన - పంపిణీ బాధ్యతల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, నష్టాలు ఇండస్ట్రీ వ‌ర్గాల్లో అప్ప‌ట్లోనే తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఈ చిత్రానికి సంబంధించి ఫైనాన్స్ వ్యవహారాలు, అప్పులు తమను కోలుకోలేని దెబ్బతీశాయని డిస్ట్రిబ్యూటర్లు బ‌హిరంగంగానే వాపోయారు. సినిమా ఫలితం తేడా కొట్టడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన చెందారు. అయితే సినిమా విడుద‌లై ఫ్లాప్ టాక్ తెచ్చుకుని.. నష్టాలపాలై తాము సర్వస్వం కోల్పోయినా.. దర్శక నిర్మాతల నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేదని స‌ద‌రు మ‌హిళా డిస్ట్రిబ్యూటర్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు- ప్రముఖ హీరోయిన్ కం నిర్మాత కనీసం తమ గోడును పట్టించుకోలేదని..తమను ఆదుకునే ప్రయత్నం చేయలేదని వారు మండిపడ్డారు. తమకు జరిగిన నష్టాలపై ఫిలింఛాంబ‌ర్ స‌హా ఎవరూ స్పందించకపోవడంతో నిరాశ చెందామ‌ని తెలిపారు.

ఎంతో నమ్మకంతో.. భారీ ఆశలతో ఈ సినిమా థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేశామని.. కానీ సినిమా డిజాస్టర్ కావడంతో పెట్టిన పెట్టుబడిలో కనీసం సగం కూడా రికవరీ కాలేదని డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు. మార్కెట్‌లో ఉన్న అప్పులవాళ్ళ ఒత్తిళ్లు తట్టుకోలేక... కుటుంబాలను ఎలా పోషించాలో తెలియక దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయిన‌ట్టు తెలిపారు.

సినిమా రిలీజ్ ముందు వారు బ‌తిమాలారు. రిలీజ్ కాక‌పోతే ఆర్థిక భారంతో తమకు ఇక చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేదంటూ వారు తమ దుస్థితిని కన్నీళ్లతో బయటపెట్టి బ‌తిమాల‌డంతో కోట్లాది రూపాయ‌ల డ‌బ్బును ఖ‌ర్చు చేసామ‌ని కూడా స‌ద‌రు మ‌హిళా పంపిణీదారు వెల్ల‌డించారు. అయితే మూవీ డిజాస్ట‌ర్ అయ్యాక క‌నీసం ఫోన్ కూడా తీయ‌కుండా త‌ప్పించుకుని తిరిగిన‌ట్టు పంపిణీదారు తెలిపారు. ఇప్ప‌టికీ త‌మ ఫోన్ లు లిఫ్ట్ చేయ‌డం లేద‌ని స‌ద‌రు స్టార్ డైరెక్ట‌ర్ అత‌డి స్నేహితురాలి గురించి పంపిణీదారు ఆవేద‌న వ్య‌క్తం చేసారు.

టాలీవుడ్‌లో ఇలాంటి పెద్ద సినిమాల ఫ్లాప్‌ల వల్ల బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎంతటి దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటారో ఈ ఘటన మరోసారి కళ్లకు కట్టింది. నిర్మాతలు, దర్శకులు తమ చిత్రాల ఫలితాల బాధ్యతను షేర్ చేసుకుంటూ.. నష్టాల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడానికి ముందుకు రావాలని ఇండస్ట్రీ వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News