'రెండేళ్లలో కోటి మందికి ఆకలి బాధలు'.. 'రణబాలి' ట్రూత్ 1 ఎలా ఉంది?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా రణబాలి.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా రణబాలి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన సింగనమల రణబాలి అనే యోధుడి కథతో ఆ సినిమా తెరకెక్కుతోంది. దసరా కానుకగా అక్టోబర్ 16న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే సినిమా స్టోరీకి సంబంధించిన హిస్టరీని ఆడియన్స్ కు పరిచయం చేసేందుకు రణబాలి టీమ్ స్పెషల్ డాక్యుమెంటరీ సిరీస్ ను తీసుకొస్తోంది. నెవర్ ఫర్గాట్: ది ట్రూత్ సిరీస్ పేరుతో రూపొందిస్తున్న ఆ సిరీస్ లో ఫస్ట్ పార్ట్ ను సోమవారం రిలీజ్ చేసింది. ట్రూత్ 1: ది ఫెమిన్ వుయ్ ఫర్గాట్ పేరుతో వచ్చిన ఆ వీడియో బ్రిటిష్ పాలనలో జరిగిన కరవు పరిస్థితులను, అప్పటి ప్రజల కష్టాలను చూపించింది.
1876 నుంచి 1878 మధ్య వచ్చిన గ్రేట్ మద్రాస్ ఫేమిన్ గురించి వివరించారు. ముఖ్యంగా సౌత్ ఇండియా, రాయలసీమ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితులను ప్రస్తావించారు. కరవు కారణంగా ఆకలితో ప్రజలు అల్లాడటం, తిండి లేక ప్రాణాలు కోల్పోవడం వంటి పరిస్థితులను చూపించారు. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ మాట్లాడుతూ.. 1876-78 మధ్య వచ్చిన ఆ కరవు చరిత్రలోనే విషాదకరమైన ఘటనల్లో ఒకటని చెప్పారు.
కేవలం రెండేళ్ల వ్యవధిలో దాదాపు కోటి మంది ప్రజలు ఆకలితో ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఆ సమయంలో ప్రజలు తిండి కోసం అల్లాడుతుంటే.. దేశంలో పండిన ధాన్యం, బియ్యాన్ని బ్రిటిష్ వాళ్లు తమ అవసరాల కోసం తీసుకెళ్లిపోయారని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ప్రజల ప్రాణాల కంటే తమ బిజినెస్ బెనిఫిట్స్ కే ఇంపార్టెన్స్ ఇచ్చారని ఆయన అన్నారు.
ఆ కరవు కేవలం నేచురల్ డిజాస్టర్ కాదని.. బ్రిటిష్ పాలనలోని నిర్ణయాలు పరిస్థితులను మరింత దారుణంగా మార్చాయని మూవీ టీమ్ పేర్కొంది. ఆకలి, అణచివేత, దోపిడీ మధ్య ఒక సామాన్యుడు బ్రిటిష్ పాలనకు ఎదురు తిరిగి యోధుడిగా ఎలా మారాడనేదే రణబాలి స్టోరీకి ఫౌండేషన్ అని తెలిపింది. రణబాలి స్టోరీ రెడీ చేయడానికి మూవీ టీమ్ రెండేళ్ల పాటు రీసెర్చ్ చేసినట్లు, బళ్లారి కలెక్టరేట్, లైబ్రరీలు, ఆర్కైవ్స్ నుంచి ఆధారాలను తీసుకున్నట్లు తెలిపింది.
అప్పటి పరిస్థితులను స్క్రీన్ పై చూపించేందుకు ఎంతో కష్టపడ్డామని మేకర్స్ చెప్పారు. హిస్టరీ తెలుసుకుంటుంటే మన పూర్వీకులు అనుభవించిన బాధలు గుర్తుకొస్తున్నాయని రష్మిక మందన్న తెలిపారు. ఇలాంటి విషయాలను ప్రెజెంట్ జెనరేషన్ కు పరిచయం చేసే ప్రయత్నంలో భాగమైనందుకు హ్యాపీగా ఉందని చెప్పారు. అలా ట్రూత్ 1: ది ఫెమిన్ వుయ్ ఫర్గాట్ సినిమా ప్రమోషన్ తో పాటు రణబాలి స్టోరీ బ్యాక్ డ్రాప్ ను ప్రేక్షకులకు పరిచయం చేసేలా ఉంది. అయితే ట్రూత్ 2: ది హిస్టరీ వుయ్ ఫర్గాట్ ను సెప్టెంబర్ 30న విడుదల చేయనుంది మూవీ టీమ్.