ఛార్మి, పూరిపై నిర్మాత సంచలన ఆరోపణలు.. అసలు జరిగిందేంటి?

టాలీవుడ్‌ లో నిర్మాతల మధ్య వివాదాలు అప్పుడప్పుడూ హాట్ టాపిక్‌ గా మారుతుంటాయి.

Update: 2026-09-28 18:08 GMT

టాలీవుడ్‌ లో నిర్మాతల మధ్య వివాదాలు అప్పుడప్పుడూ హాట్ టాపిక్‌ గా మారుతుంటాయి. లేటెస్ట్ గా ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మి విషయంలో తనకు ఎదురైన ఎక్స్పీరియన్సులను ఆమె షేర్ చేసుకున్నారు. డబుల్ ఇస్మార్ట్ సినిమా తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ చెబుతూ సంచలన ఆరోపణలు చేశారు.

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అధినేతగా చైతన్య రెడ్డి పలు చిత్రాలను నిర్మించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా విజయంతో లైమ్ లైట్ లోకి వచ్చారు. డబుల్ ఇస్మార్ట్ మూవీని కూడా వారే రిలీజ్ చేశారు. అయితే ఆ’ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్ లో విజయం సాధించలేకపోయింది. రామ్ పోతినేని హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాపై ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

కానీ మూవీ డిజాస్టర్ అవ్వగా, భారీ నష్టాలను మిగిల్చిందని చైతన్య రెడ్డి తెలిపారు. రిలీజ్ కు ముందు చావైనా బతుకైనా తామే అన్న ఛార్మి, విడుదల తర్వాత ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదని ఆరోపించారు. తన నంబర్‌ ను బ్లాక్ చేశారని చెప్పారు. ఇంటికి వెళ్లాలని ప్రయత్నిస్తే కూడా పరిస్థితి అలాగే ఉందన్నారు. పూరి ఫోన్ నంబర్ మార్చేశారని తెలిపారు. అలా అని నిరంజన్ రెడ్డి ముంబై వెళ్తే, తమ రెమ్యూనరేషన్ రూ.15 కోట్లు అని, చిన్న కథతో సినిమా చేయాలని అన్నారని చెప్పారు.

పోనీ వాళ్లతో మూవీ చేద్దామంటే, వాళ్లకే ప్రాఫిట్స్ లో 40 శాతం ఇవ్వాలని పూరి అన్నారట. కానీ డబుల్ ఇస్మార్ట్ తో తమకు సుమారు రూ.35-40 కోట్ల వరకు నష్టం వచ్చిందని చైతన్య రెడ్డి పేర్కొన్నారు. అయితే అక్కడితో సమస్య ముగియలేదన్నారు. డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడి పెరగడంతో పోకిరి మూవీ రీరిలీజ్ చేయాలని భావించిన సమయంలో కూడా కొత్త ప్రపోజల్ వచ్చిందని చైతన్య రెడ్డి చెప్పారు.

లాభాల్లో 70 శాతం తమకు ఇవ్వాలని, 30 శాతం మాత్రమే తమకు రావాలని ఛార్మి చెప్పారని ఆరోపించారు. ఖర్చులు కూడా తామే భరించాల్సి ఉంటుందని చెప్పారని పేర్కొన్నారు. 'ఆ తర్వాత నిరంజన్ రెడ్డిని మాత్రమే ఛార్మి సెటిల్మెంట్ కు రమ్మన్నారు. కానీ సంతకం చేసింది నేను. పేమెంట్ రిలీజ్ చేసింది నేను. నా దగ్గర డబ్బులు తీసుకుని నన్నే వద్దంటున్నారు. ఇప్పటి వరకు ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు' అని చైతన్య రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ వ్యవహారంపై ఛాంబర్‌ లో కంప్లైట్ చేసినా తమకు సరైన హెల్ప్ దొరకలేదని చైతన్య రెడ్డి చెప్పుకొచ్చారు. అగ్రిమెంట్‌ లోని ఓ క్లాజ్‌ ను చూపిస్తున్నారని చెప్పారు. అయితే చైతన్య రెడ్డి చేసిన ఆ ఆరోపణలపై పూరి జగన్నాథ్, ఛార్మి వైపు నుంచి అఫీషియల్ గా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ప్రస్తుతం మాత్రం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

Tags:    

Similar News