• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆంధ్రా వంటలకు అంబాసిడర్‌...

ఆంధ్రా వంటలకు అంబాసిడర్‌ అయిన కాజల్‌

By - Tupaki Desk
Update: 2020-05-09 06:11 GMT
కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ కారణంగా పలువురు సెలబ్రెటీలు తమ కొత్త విద్యలను ప్రదర్శిస్తున్నారు. ఎప్పుడు షూటింగ్స్‌ తో బిజీగా ఉండే స్టార్స్‌ ఈ లాక్‌ డౌన్‌ టైంను ఇతర విషయాలపై దృష్టి పెట్టారు. పలువురు స్టార్స్‌ వంట చేస్తున్న వీడియోలను మనం ఇప్పటి వరకు సోషల్‌ మీడియాలో చూశాం. తాజాగా కాజల్‌ కూడా వంట చేసింది. అది కూడా ఆంధ్రా మీల్స్‌. ఆంధ్రాలో చాలా ఫేమస్‌ అయిన వంటకాలను ఆమె తన కుటుంబ సభ్యులకు వండి పెట్టింది.

షూటింగ్స్‌ లేని కారణంగా ఆంధ్రా మీల్స్‌ ను మిస్‌ అవుతున్నాను. అందుకే నేనే సొంతంగా చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే బెండకాయ పులుసు.. సోరకాయ పచ్చడి మరియు పెసరట్టును వేసినట్లుగా ట్వీట్‌ చేసింది. తెలుగు జనాలకు ఈ మూడు కూడా చాలా దగ్గర అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూడు కూడా తెలుగు వారికి ట్రేడ్‌ మార్క్‌ వంటకాలు. వీటి రుచి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఉత్తరాది వారికి కనీసం వీటిని ఇలా చేస్తారనే విషయం కూడా తెలియదు.

అలాంటిది కాజల్‌ ఆంధ్రా వంటకాలను ముంబయిలో చేయడంతో పాటు తన ట్విట్టర్‌ హ్యాండిల్‌ లో ఫొటోలతో సహా పెట్టడంతో ఇప్పుడు ఉత్తరాది వారి నాలుక కూడా ఊరుతున్నట్లుగా ఉంది. చూస్తుంటే తినాలనిపిస్తుంది అంటూ చాలా మంది కామెంట్స్‌ చేస్తున్నారు. కాజల్‌ లో ఇలాంటి విద్య కూడా దాగి ఉందా అంటూ మరికొందరు అనుమానంగా చూస్తున్నారు. మొత్తానికి ఆంధ్రా వంటకాలకు మంచి పబ్లిసిటీ చేసిన కాజల్‌ కు తెలుగు వారు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఆంధ్రా మీల్స్‌ కు కాజల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ గా మారిందని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.
Tags:    
  • tupaki news 
  • upcoming news 
  • tupaki upadtes tupaki movie news 
  • tupaki latest news 

Similar News

'ఆకాశంలో ఒక తార' రివ్యూ

2026-11-19 20:32 GMT

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Copyright @2026

Powered by Blink CMS